భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో 5G బ్రాడ్‌బ్యాండ్ ట్రయల్స్!! పూర్తి వివరాలు ఇవిగో...

|

భారతదేశంలో కరోనా ప్రభావంతో ప్రజలు ఇంటి వద్ద ఉండి పనిచేయడం మొదలుపెట్టారు. అయితే ఇంటి వద్ద నుండి పనిచేయడం ప్రారంభించడంతో చాలా మంది పట్టణాలను వదిలి తమ యొక్క సొంత గ్రామాలలో ఉండి పనిచేస్తున్నారు. ప్రస్తుతం మారు మూల ప్రాంతాలలో సైతం ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఇటీవల గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కోసం 5G ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని అజోల్‌ గ్రామంలో ఈ పరీక్ష జరుగుతోంది. 5G ట్రయల్ కోసం గాంధీనగర్‌లోని ఉనావా పట్టణం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (BTS) ఏర్పాటు చేయబడింది. కొన్ని నివేదికల ప్రకారం టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అధికారులతో పాటు ఇద్దరు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల బృందం ఈ ట్రయల్స్ లో డేటా యొక్క వేగాన్ని కొలిచేందుకు అజోల్ గ్రామానికి చేరుకున్నారు. ఇందులో గరిష్ట డౌన్‌లోడ్ స్పీడ్ 105.47 Mbps మరియు అప్‌లోడ్ స్పీడ్ 58.77 Mbps నమోదు చేయబడింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

VR కనెక్టవిటితో 5G ట్రయల్స్

VR కనెక్టవిటితో 5G ట్రయల్స్

కొన్ని నివేదికల ప్రకారం అజోల్‌లోని 5G ట్రయల్స్‌లో బహుళ వినియోగ కేసులు పరీక్షించబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ (VR) కనెక్ట్ చేయబడిన క్లాస్‌రూమ్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ కంటెంట్ ప్లేబ్యాక్ వంటివి మరిన్ని పరీక్షించబడుతున్నాయి. VR కనెక్టెడ్ క్లాస్‌రూమ్ అనేది విద్యార్థులను మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ వేల కిలోమీటర్ల దూరంలో కూర్చున్నప్పటికీ ఇరువురిని నేరుగా కనెక్ట్ చేస్తుంది.5G ఇమ్మర్సివ్ గేమింగ్ కూడా వినియోగదారుల కోసం 360-డిగ్రీల డిజిటల్ అనుభవంతో పాటు పరీక్షించబడుతోంది. ఇక్కడ వినియోగదారులు చుట్టూ తిరగవచ్చు మరియు నిర్దిష్ట వాతావరణంలో వస్తువులు మరియు వ్యక్తులను గుర్తించవచ్చు.

PIB

PIB_భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ప్రకారం నోకియా మరియు వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) యొక్క సాంకేతిక బృందంతో పాటు గుజరాత్ సర్కిల్‌కు చెందిన సీనియర్ DoT అధికారుల బృందం గాంధీనగర్ గ్రామీణ ప్రాంతంలోని 5G టెస్టింగ్ సైట్‌లను సందర్శించింది.

5G vs 4G నెట్‌వర్క్‌: యూజర్ డిమాండ్ కాంపిటీషన్ లో పైచేయి ఎవరిది??5G vs 4G నెట్‌వర్క్‌: యూజర్ డిమాండ్ కాంపిటీషన్ లో పైచేయి ఎవరిది??

DoT
 

నవంబర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కేటాయించిన 3.5 GHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ని ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో 5Gని పరీక్షించడానికి Vodafone Idea (Vi) మరియు Nokia భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. మూడవ అతిపెద్ద టెల్కో మరియు Nokia 100+ Mbps గరిష్ట డౌన్‌లోడ్ స్పీడ్‌ని చూసింది మరియు ట్రయల్ నెట్‌వర్క్ ప్రాంతం దాదాపుగా 17.1 కి.మీ వరకు కలిగి ఉంది. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే అనేక కంపెనీలు మరియు రాబోయే తరం స్టార్టప్‌లతో భాగస్వామ్యం చేయడం ద్వారా 5G ట్రయల్స్‌ని ఉపయోగించి బహుళ వినియోగ కేసులను పరీక్షించింది. mmWave 5G స్పెక్ట్రమ్‌ని ఉపయోగించి 5G ట్రయల్స్ సమయంలో Vi 4.2 Gbps గరిష్ట డౌన్‌లోడ్ వేగాన్ని సాధించగలిగింది మరియు 200 Mbps కంటే ఎక్కువ వేగంతో అప్‌లోడ్ చేయగలదు.

Best Mobiles in India

English summary
5G Broadband Trials Starts in Rural India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X