హైదరాబాద్ వాసులకు పండగ, ఇకపై Airtel అపరిమిత డేటా, డిస్కౌంట్లు

టెలికాం రంగంలో రోజురోజుకు పోటీ అనివార్యమైన నేపథ్యంలో టెల్కోలు భారీ ఆఫర్లతో దూసుకొస్తున్నాయి.

|

టెలికాం రంగంలో రోజురోజుకు పోటీ అనివార్యమైన నేపథ్యంలో టెల్కోలు భారీ ఆఫర్లతో దూసుకొస్తున్నాయి. జియో AGM ఈవెంట్లో బ్రాడ్ బ్యాండ్ తో త్వరలో దూసుకువస్తున్నామనే ప్రకంపనలు రేపిన నేపథ్యంలో దానికి ధీటుగా Airtel కౌంటర్ వేసింది. జియోగిగాఫైబర్‌' ను టార్గెట్ చేస్తూ తన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై ఎఫ్‌యూపీ(ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ) పరిమితిని ఎత్తివేసింది. అయితే ముందుగా ఈ శుభవార్తను హైదరాబాద్ వాసులు మాత్రమే అందుకోనున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా జియోకి గట్టిపోటీ ఇచ్చేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ రంగంలోకి దిగింది.

జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్ ఆ ఫోన్‌కి మాత్రమే! నిజాలు తెలుసుకోండిజియో మాన్‌సూన్ హంగామా ఆఫర్ ఆ ఫోన్‌కి మాత్రమే! నిజాలు తెలుసుకోండి

హైదరాబాద్‌ సర్కిల్‌లో..

హైదరాబాద్‌ సర్కిల్‌లో..

హైదరాబాద్‌ సర్కిల్‌లో ప్రతి బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై కూడా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ డేటాను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తుంది. అంటే మీ కనెక్షన్‌పై హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సస్‌ను ఎలాంటి డేటా పరిమితి లేకుండా పొందవచ్చు.

 రూ.349 నుంచి రూ.1299 మధ్యలో

రూ.349 నుంచి రూ.1299 మధ్యలో

హైదరాబాద్ సర్కిల్‌లో రూ.349 నుంచి రూ.1299 మధ్యలో నాలుగు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది.

ఆరు నెలలు, ఏడాది కాలానికి

ఆరు నెలలు, ఏడాది కాలానికి

ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది.

అన్ని సర్కిళ్లలో

అన్ని సర్కిళ్లలో

ఈ డిస్కౌంట్లు అన్ని సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఆఫర్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ మినహాయించి మరే ఇతర సర్కిల్‌లోనూ లేదు.

ఇతర రాష్ట్రాల్లో..

ఇతర రాష్ట్రాల్లో..

ఢిల్లీలో రూ.799 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై 100 జీబీ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా పరిమితి ఉంది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో సైతం అక్కడ వారికి అనుగుణంగా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

100ఎంబీపీఎస్‌ స్పీడు

100ఎంబీపీఎస్‌ స్పీడు

హైదరాబాద్‌ సర్కిల్‌లో రూ.349 ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే, 8 ఎంబీపీఎస్‌ వరకు స్పీడులో అపరిమిత డేటా లభ్యమవుతుంది. అదేవిధంగా రూ.1,299 ప్లాన్‌పై 100ఎంబీపీఎస్‌ స్పీడులో డేటా పొందవచ్చు.

డౌన్‌లోడ్‌ ..

డౌన్‌లోడ్‌ ..

ఈ స్పీడులో ఈమెయిల్‌ నుంచి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆడియో, వీడియో ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వెబ్‌ను సర్ఫ్‌ చేసుకోవడం చేయొచ్చు.

ఆగస్టు 15 నుంచి

ఆగస్టు 15 నుంచి

కాగా జియోగిగాఫైబర్‌ ద్వారా 1జీబీపీఎస్‌ స్పీడులో డేటాను అందించనున్నట్టు రిలయన్స్‌ జియో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

Best Mobiles in India

English summary
Jio GigaFiber Launch: Airtel Removes FUP Limits on Broadband Plans in Select Cities More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X