ఆండ్రాయిడ్ 'ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్' సోర్స్ కోడ్ విడుదల

By Super
|
Android 4.0 Ice Cream Sandwich
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు ఇటీవలే తెలిపిన సమాచారం ప్రకారం 'ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌'కి సంబంధించిన సోర్స్ కోడ్ ఇంటర్నెట్లో అందుబాటులోకి ఉంచడం జరిగిందన్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని త్వరలో మొబైల్ మార్కెట్లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ నెక్సస్‌లో ఇమిడికృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటర్నెట్లో విడుదల చేసిన సోర్స్ కోడ్ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1కి సంబంధించినది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే శాంసంగ్ గెలాక్సీ నెక్సస్‌లో చూశామో అదే ఈ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1 ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైతే ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఉన్నారో వారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొత్త డివైజ్‌ల ద్వారా టెస్టు చేయవచ్చు. ఇంటర్నెట్లో‌కి ఈ సోర్స్ కోడ్‌ని విడుదల చేయడానికి కారణం ఆండ్రాయిడ్ యూజర్స్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఎక్స్ పీరియన్స్‌ని పోందగలుగుతారని తెలిపారు.

ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'ని కూడా విడుదల చేయడం జరిగింది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'లో ఆండ్రాయిడ్ హానీ కూంబ్‌కి సంబంధించిన సమాచారం ఉంది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'కి సంబంధించిన సమాచాం కావాలంటే యూజర్స్ ఈ లింక్ ద్వారా http://groups.google.com/group/android-building/msg/c0e01b4619a1455a సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

ఇక ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌తో పాటు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లలో మాత్రమే నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్‌లలో ఈ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడడం వల్ల మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X