AP Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పుడు చాలా చౌక

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లేదా AP ఫైబర్ నెట్ ను ప్రెవేశపెట్టింది. ఇప్పుడు ఇది తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను సవరించింది. సవరించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల యొక్క ధరలు ఇప్పుడు కేవలం రూ.204ల నుండి ప్రారంభమయి రూ.2,999 వరకు వివిధ రకాల ప్లాన్లను కలిగి ఉంటాయి. AP ఫైబర్ యొక్క ప్లాన్లలో వాటి యొక్క ధరలను బట్టి డేటా 100Mbps వేగంతో ప్రతి నెలా 2TB FUP పరిమితిని అందిస్తాయి.

AP ఫైబర్ నెట్

AP ఫైబర్ నెట్

AP ఫైబర్ నెట్ గృహాలకు మరియు సంస్థలు / ప్రైవేట్ కార్యాలయాలకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తోంది. కంపెనీ ట్రిపుల్ ప్లే పథకంలో భాగమైనందున హోమ్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు టెలివిజన్ ఛానెల్‌లతో కూడా అందించబడతాయి. AP ఫైబర్ పేరుకు సూచించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజమాన్యంలో నడుస్తోంది. ప్రస్తుతం AP ఫైబర్ 13 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. ఇప్పుడు ఇది ఇతర నగరాలకు కూడా తన సేవా లభ్యతను వేగంగా విస్తరిస్తోంది.

 

 

5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌

AP ఫైబర్ కొత్త అప్‌డేట్

AP ఫైబర్ కొత్త అప్‌డేట్

గృహ వినియోగదారులకు AP ఫైబర్ ప్లాన్‌లు

గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ల విషయానికి వస్తే అవి కేవలం రూ.204 నుండి ప్రారంభమై రూ.599 ధరల వద్ద చాలా ప్రయోజనాలను అందిస్తాయి. AP ఫైబర్ బడ్జెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి ఇది గృహ వినియోగదారులకు హై-స్పీడ్ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించడం లేదు. రూ.204 (పన్నులు మినహాయించి) ధర గల AP ఫైబర్ బేసిక్ ప్లాన్‌లో 250 ఛానెల్స్, 15mbps వేగంతో 50 జిబి FUP డేటాను అందిస్తుంది. ఈ డేటా తర్వాత దాని యొక్క వేగం 1mbps కు తగ్గించబడుతుంది.

 

 

Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!

 

AP ఫైబర్ హోమ్ ఎసెన్షియల్ ప్లాన్‌

AP ఫైబర్ హోమ్ ఎసెన్షియల్ ప్లాన్‌

AP ఫైబర్ యొక్క హోమ్ ఎసెన్షియల్ ప్లాన్‌ను ఒక నెలకు రూ.299 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ వద్ద ఇది 250 కేబుల్ టివి ఛానెల్స్, 30mbps వేగంతో నెలకు 75 జిబి డేటాను అందిస్తుంది. దీని తరువాత దీని ఎఫ్‌యుపి యొక్క వేగం 3mbps కు తగ్గించబడుతుంది. స్టాండర్డ్ ట్రిపుల్ ప్లే ప్లాన్ 250 కేబుల్ టివి ఛానెల్‌లతో పాటుగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లలో 50mbps అప్‌లోడ్ + డౌన్‌లోడ్ వేగంతో 100 జిబి ఎఫ్‌యుపి డేటాను అందిస్తుంది. దీని ఎఫ్‌యుపి పరిమితి తర్వాత దీని వేగం 5mbps కు తగ్గించబడుతుంది.

 

 

Realme X50 Pro 5G: మరో 6 రోజులలో Feb24న ఇండియాలో ప్రారంభంRealme X50 Pro 5G: మరో 6 రోజులలో Feb24న ఇండియాలో ప్రారంభం

AP ఫైబర్ ప్రీమియం ప్లాన్

AP ఫైబర్ ప్రీమియం ప్లాన్

చివరగా హోమ్ వినియోగదారుల కోసం నెలకు 599 రూపాయల ధర గల AP ఫైబర్ ప్రీమియం ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ప్రతి నెలా 50 Mbps వేగంతో 200GB FUP పరిమితి డేటాను అందిస్తుంది. FUP పరిమితి తర్వాత దాని యొక్క వేగం 10 Mbpsకు తగ్గించబడుతుంది. పైన పేర్కొన్న ప్లాన్‌ల ధరలకు అదనంగా ప్రత్యేకమైన పన్నులు కూడా ఉంటాయి.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

సంస్థలు / ప్రైవేట్ కార్యాలయాల కోసం AP ఫైబర్ ప్లాన్‌లు

సంస్థలు / ప్రైవేట్ కార్యాలయాల కోసం AP ఫైబర్ ప్లాన్‌లు

హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటుగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సంస్థలు / ప్రైవేట్ కార్యాలయాలకు కూడా AP ఫైబర్ ప్రత్యేకమైన ప్లాన్‌లను అందిస్తోంది. సంస్థల కోసం AP ఫైబర్ బేసిక్ ప్లాన్ యొక్క ధర రూ.999 నుండి మొదలవుతుంది. ఇది 400GB FUP పరిమితి వరకు 100 Mbps వేగంతో అందిస్తుంది.

 

 

Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...

AP ఫైబర్ స్టాండర్డ్ ప్యాక్

AP ఫైబర్ స్టాండర్డ్ ప్యాక్

AP ఫైబర్ యొక్క స్టాండర్డ్ ప్యాక్ రూ.1,499 ధరను కలిగి ఉండి ఇది 100 Mbps వేగంతో ఒక నెలకు 800GB FUP పరిమిత డేటాను అందిస్తుంది. చివరగా ప్రీమియం ప్లాన్ 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 2TB FUP పరిమిత డేటాను ఒక నెలకు రూ.2,499 ధర వద్ద అందిస్తుంది. ఈ మూడు ప్లాన్‌లు 1 Mbps వేగంతో వచ్చినవి మరియు ఇవి AP ఫైబర్ నుండి ట్రిపుల్ ప్లే ప్లాన్‌లలో భాగం కావు కాబట్టి కేబుల్ టీవీ సేవలు అందించబడవు.

Best Mobiles in India

English summary
AP Fiber Broadband Plans Revised now Starts at Rs 204

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X