ఇస్రో అదిరిపోయే ఆఫర్,చంద్రయాన్ 2ను లైవులో చూసే అవకాశం

By Gizbot Bureau
|

ఆకాశాన్ని తాకే ఎత్తులో నిల్చున్న తెల్లటి రాకెట్‌ లాంచర్‌.. దానిలోనుంచి నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్‌.. ఈ దృశ్యాలను మనం చాలాసార్లు టీవీల్లోనే చూస్తుంటాము. అయితే ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూఃే అవకాశాన్ని నాసా కల్పిస్తోంది. సాదాసీదా ప్రయోగం కాకుండా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణ అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది.

chandrayaan2 online registration website to watch launch livecrashes

ఈ నెల 15 తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్‌–2ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించే చంద్రయాన్-2 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్ ఆర్) నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎం ఆర్ ఆర్ చైర్మన్ డాక్టర్ బి ఎన్ సురేష్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్‌తో పాటు సీనియర్ శాస్తవ్రేత్తలు సుదీర్ఘంగా చర్చించారు.

దరఖాస్తు ఎలా ?

దరఖాస్తు ఎలా ?

ఈ ప్రయోగాన్ని చూసేందుకు 10వేల మందికి అవకాశం కల్పిస్తోంది. దీనికోసం www.isro.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రోజే(జూలై 4న) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇక, వీక్షకుల కోసం 10వేల మంది సామర్థ్యంతో గ్యాలరీని కూడా నిర్మిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది.

జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం 1 రాకెట్ ద్వారా

జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం 1 రాకెట్ ద్వారా

జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నారు. ఉపగ్రహం భవనంలోచంద్రయాన్-2 మిషన్‌కు సంబంధించిన అర్బిటర్‌కు ల్యాండర్, రోవర్‌ను అనుసంధానం చేసి వాటిచుట్టూ ఉష్టకవశాన్ని అమర్చే ప్రక్రియను కూడా పూర్తిచేశారు.ఈ రాకెట్ ద్వారా చంద్రుడి పైకి అర్బిటర్, రోవర్, ల్యాండర్‌ను పంపించనున్నారు. ఇప్పటికే షార్‌లో రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి రాకెట్ శిఖర భాగాన చంద్రయాన్ మిషన్‌ను అమర్చే ప్రక్రీయను పూర్తిచేసి వివిధ రకాల పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించారు.

 మొత్తం రూ.978కోట్లు ఖర్చు

మొత్తం రూ.978కోట్లు ఖర్చు

చంద్రుడి పై ఉన్న రాళ్లు, మట్టి తదితరానలు పరిశీలించే అల్ఫా ఫర్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటరు అనే పేలోడ్ చంద్రయాన్-2 మిషన్‌లో ఉంటుంది. ఇది చాలా చిన్నదైనా అందులో ముఖ్యమైన పరికరం. ఇందులో జాబిల్లి చుట్టూ అర్బిటర్ తిరుగుగా చంద్రుడి పై దిగే ల్యాండర్, చుట్టూ సంచరించే రోవర్ ఛాయా చిత్రాలను తీసి పంపే విధంగా రూపకల్పన చేశారు. చంద్రయాన్-2 ప్రాజెక్టుకు ఇస్రో మొత్తం రూ.978కోట్లు ఖర్చు చేశారు.

52రోజుల తరువాత

52రోజుల తరువాత

ప్రయోగం జరిగిన 52రోజుల తరువాత అనగా సెప్టెంబరు 7వ తేదీ చంద్రుడి పై దక్షిణ ధృవం దగ్గరగా ఉపగ్రహం చేరుకోనుంది. అప్పుడు అదే సమయంలో ల్యాండర్‌లో నుంచి రోవర్ బయటకు వచ్చి సుమారు 300నుంచి 400కి.మీ దూరం పయనిస్తుంది. రోవర్ చంద్రుడి పై 14రోజుల పాటు ఉండి వివిధ పరిశోధనలు చేయనుంది. చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి డేటా, చిత్రాలను 15నిమిషాల్లో పంపేలా శాస్తవ్రేత్తలు రూపకల్పన చేశారు.

Best Mobiles in India

English summary
chandrayaan2 online registration website to watch launch livecrashes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X