అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ మధ్య వన్‌ప్లస్ 3 వార్, తల బాదుకుంటున్న వన్‌ప్లస్

Written By:

ఈ కామర్స్ దిగ్గజాల మధ్య ఇప్పుడు వన్ ప్లస్ 3 వార్ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్లో వన్ ప్లస్ 3 ఫోన్లను బిగ్ షాపింగ్ డేస్ సంధర్భంగా అందించనున్నామని ఏకంగా రూ. 9 వేల డిస్కౌంట్ తో వినియోగదారులకు లభిస్తుందని. ఇది స్టాక్ ఉన్నంతవరకేనంటూ ప్రకటనలు గుప్పించింది. ఈ ప్రకటనలపై ఇప్పుడు వివాదం మరింతగా రాజుకుంది.

షియోమీ ఫోన్లకు నౌగట్ అప్‌డేట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్

ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టిన వన్ ప్లస్ 3 ఫోన్ యాడ్ కేవలం రెండు నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రూ. 9 వేట డిస్కౌంట్ తో ఫోన్ కొనాలనుకున్న వారికి నిరాశనే ఎదురైంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్లిప్ కార్ట్ తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని

అయితే ఈ యాడ్ సంచలనం కలిగించగా, తాము ఫ్లిప్ కార్ట్ తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, ఇదెక్కడి గోలని వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు.

బ్రదర్, వాట్ ఈజ్ దిస్?

ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ను ట్యాగ్ చేస్తూ, బ్రదర్, వాట్ ఈజ్ దిస్? అని ప్రశ్నించారు. తాము వన్ ప్లస్ 3 అమ్మకాల కోసం అమెజాన్ తో ప్రత్యేక డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఈ ట్వీట్ పై సచిన్ బన్సాల్ స్పందించలేదు.

అమ్మకందారుల ఇష్టానుసారమే

అయితే, ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఓ ప్రకటన వెలువరుస్తూ, దేశవ్యాప్తంగా ఏ అమ్మకందారుడైనా మా వెబ్ సైట్లో అతని ప్రొడక్టులను విక్రయించుకోవచ్చు. అయితే, వారు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్లు, వాటి ధరలు అమ్మకందారుల ఇష్టానుసారమే ఉంటాయని పేర్కొనడం గమనార్హం.

వన్ ప్లస్ 3 ధర

వాస్తవానికి అమెజాన్‌లో వన్ ప్లస్ 3 ధరను రూ. 27.999 గా నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ ఫోన్ ను రూ. 20 వేల కన్నా తక్కువకు అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రకటన రావడాన్ని అటు వన్ ప్లస్, ఇటు అమెజాన్ తప్పుబట్టాయి.

అనధికారికంగా జరిగే లావాదేవీల్లో

తాము ప్రత్యేకంగా అమెజాన్ తో డీల్ కుదుర్చుకుని ఈ ఫోన్ విక్రయిస్తున్నామని, అనధికారికంగా జరిగే లావాదేవీల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, కస్టమర్లు మోసపోవద్దని కార్ల్ పెయ్ కోరారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Flipkart Sale: OnePlus 3 to Be Available at Rs. 18,999 but Confusion Continues read more at gibzot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting