మొబైల్ డివైజెస్ కోసం కొత్త హూమ్ పేజ్ షార్ట్ కట్స్: గూగుల్

Posted By: Super

మొబైల్ డివైజెస్ కోసం కొత్త హూమ్ పేజ్ షార్ట్ కట్స్: గూగుల్

గూగుల్ ఏపని చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గూగుల్ ఇప్పుడు తన దృష్టిని మొబైల్ టెక్నాలజీ వైపు పెట్టింది. మొబైల్ హుం పేజి కొరకు ప్రత్యేకంగా కొన్ని కొత్త ఫీచర్స్ గూగుల్.కామ్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గూగుల్ కొత్తగా తీసుకొచ్చే ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఐఓయస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి మొబైల్స్‌లలో ఉపయోగించుకోవడానికి వీలవుతుందని తెలిపింది. ఈ షార్ట్ కట్స్‌ని మొబైల్స్‌లలో ఉంచడం వల్ల లోకల్ సెర్చింగ్ చాలా ఈజీగా ఉంటుందని తెలిపింది.

ఈ షార్ట్ కట్స్ వల్ల ముఖ్యంగా ఉపయోగం ఏమిటంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి అన్ని స్దలాలను త్వరితగతిన సెర్ట్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, బార్స్ మొదలగున్నవి ఐకాన్స్‌‌గా మీ డెస్క్ టాప్‌పై ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డిజైన్ అంతా పూర్తి కావడం జరిగింది. త్వరలోనే దీనిని ఆఫీసియల్‌‌గా ప్రకటించనున్నారు. మీ సెర్చ్ రిజల్డ్స్‌‌లో మీకు కావాల్సింది దొరికినప్పుడు దానిని మార్కర్‌‌తో కూడా చూపిస్తుంది.


కొత్త షార్ట్ కట్స్‌తో పాటు గూగుల్ మొబైల్ సైట్స్ లోకి వెళ్శి సొంతంగా సెర్చింగ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పించింది. ఈ ఫీచర్ గతంలో ఆండ్రాయిడ్, ఐఓయస్ ఆపరేటింగి సిస్టమ్ గూగుల్ సెర్చ్ అప్లికేషన్‌లో ఉన్నప్పటికి, ఇప్పుడు దీనిని డైరెక్టుగా మొబైల్ సైట్‌లోనే ప్రవేశపెట్టడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot