మే 2021 నెలకు అధిక డేటా కోసం అవసరమైన 4G డేటా ప్లాన్‌లు ఇవే...

|

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా తమ వినియోగదారులకు టన్నుల కొద్ది ప్రయోజనాలతో అనేక ప్రీపెయిడ్ 4G డేటా ప్లాన్‌లను అందిస్తున్నారు. వినియోగదారులకు ఎంచుకోవడానికి చాలానే ఎంపికలు ఉన్నాయి. వీటిలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడం కొద్దిగా కష్టమే. కొంత మంది వినియోగదారులు రెండు రకాల సిమ్ లను వాడుతూ ఉంటారు. ఇండియాలో కరోనా యొక్క సెకండ్ వేవ్ యొక్క తీవ్రత అధికంగా ఉన్నందు వలన చాలా మంది ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే మే 2021 నెలలో 4G డేటా కోసం ఎంచుకునే ప్లాన్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో పాపులర్ 4G డేటా ప్లాన్స్

రిలయన్స్ జియో పాపులర్ 4G డేటా ప్లాన్స్

4G డేటా ప్లాన్ల జాబితాలో రిలయన్స్ జియో యొక్క నాలుగు ప్లాన్లు ముందువరుసలో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.199, రూ.555, రూ.599 మరియు రూ.2,399. ఇవి అన్ని కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS మరియు జియో యొక్క అన్ని యాప్ల కాంప్లిమెంటరీ చందాతో వస్తాయి. ఈ ప్లాన్ల మధ్య తేడా ఏమిటంటే డేటా ప్రయోజనాలు మరియు వాటి యొక్క వాలిడిటీ.

జియో

రూ.199 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. రూ.555 ప్లాన్ 1.5GB డైలీ డేటాను 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. అలాగే రూ.599, రూ.2,399 ధరల వద్ద లభించే ప్లాన్‌ల విషయానికొస్తే ఈ రెండు ప్లాన్‌లు 2GB డైలీ డేటాతో వరుసగా 84 రోజులు మరియు 365 రోజుల వాలిడిటీ కాలానికి లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా(Vi) పాపులర్ 4G డేటా ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా(Vi) పాపులర్ 4G డేటా ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా పాపులర్ 4G డేటా ప్లాన్‌లు వరుసగా రూ.149, రూ.449, రూ.801, రూ.2,399 ధరలను కలిగి ఉన్నాయి. ఇందులో రూ .149 ప్లాన్ మొత్తంగా 300SMS లతో రాగా మిగిలిన అన్ని ప్లాన్‌లు రోజుకు 100SMS లు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌తో వస్తాయి.

రూ.149 ప్లాన్ వినియోగదారులకు 3GB మొత్తం డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. రూ.449 ప్లాన్ వినియోగదారులకు ‘బింగే ఆల్ నైట్' మరియు ‘డబుల్ డేటా' ఆఫర్‌ను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు 56 రోజుల చెల్లుబాటు కాలంలో 4GB రోజువారీ డేటాను పొందుతారు. అలాగే రూ.801 ప్లాన్‌లో 3GB డైలీ డేటాతో పాటు 48GB బోనస్ డేటాను 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. Vi క్లబ్బులు ఈ 4G డేటా ప్లాన్‌ను బింగే ఆల్ నైట్ మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో అందిస్తున్నాయి. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

భారతి ఎయిర్‌టెల్ పాపులర్ 4G డేటా ప్లాన్స్

భారతి ఎయిర్‌టెల్ పాపులర్ 4G డేటా ప్లాన్స్

భారతి ఎయిర్‌టెల్ యొక్క ప్రసిద్ధ 4G డేటా ప్లాన్‌లు వరుసగా రూ.199, రూ.399, రూ.598, రూ.2,498 ధరల వద్ద లభిస్తాయి. రూ.199 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1Gb డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. రూ.399 మరియు రూ.598 ప్లాన్ రెండూ కూడా 1.5GB రోజువారీ డేటాను వరుసగా 56 రోజులు మరియు 84 రోజుల వాలిడితో లభిస్తాయి. చివరగా రూ.2,498 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను 365 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100SMS/ రోజుతో పాటు ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్స్ మరియు 1 నెల ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్ తో వస్తాయి.

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vi: Popular 4G Data Plans For May 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X