మైక్రోసాఫ్ట్‌లో 18,000 ఉద్యోగాలకు కోత

Posted By:

అంతర్జాతీయ స్థాయిలో, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ తమ సంస్థల్లో పనిచేస్తున్న 18,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. వచ్చే ఏడాది కాలంలో ఈ తొలగింపు ప్రక్రియ ఉంటుంది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. 39 సంవత్సరాల చరిత్ర కలిగిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటి సారి.

మైక్రోసాఫ్ట్‌లో 18,000 ఉద్యోగాలకు కోత

ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగ తొలగింపు కష్టతరమే అయినప్పటికి ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగులను అధిక సంఖ్యలో తొలగించక తప్పలేదని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తొలగింపునకు గురైన వారికి పరిహారంతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్యోగాల మార్పునకు సహకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ ఉన్నతికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఆమేర గౌరవిస్తామని తెలిపారు. ఉద్యోగుల తొలగింపులో భాగంగా ముందుగా 13,000 మంది సిబ్బందిని తగ్గిస్తామని, ఏయే పోస్టులు రద్దవుతాయనే అంశాన్ని రాబోయే 6 నెలల్లో వెల్లడిస్తామని సత్య నాదెళ్ల వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగుల తొలగింపు ప్రభావం భారత్ పై తక్కువగానే ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా అధికారిక ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

2013 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 99,000. ఇటీవల మైక్రోసాఫ్ట్ నోకియా సంస్థను స్వాధీనం చేసుకోవటంతో ఆ సంస్థకు చెందిన 25,000 మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌కు జతయ్యారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot