ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి

|

ఒప్పో A57 మరియు ఒప్పో A57s 4G స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా త్వరలోనే ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇండియాలో వీటి యొక్క లాంచ్ గురించి చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ ఫోన్‌ల యొక్క కలర్ ఎంపికలతో సహా కీలకమైన స్పెసిఫికేషన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి. ఒప్పో A57s మరియు A57 4G రెండు వేరు వేరు RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో A57 4G 6.56-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేతో మరియు మీడియాటెక్ హీలియో G35 SoC ద్వారా శక్తిని పొందుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో రావచ్చు. ఒప్పో సంస్థ ఇటీవలే ఒప్పో A57 (2022)ని థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించింది. అది 4G మోడల్ కాబట్టి ఒప్పో A57 కూడా 4G మోడల్‌గా భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆశించవచ్చు.

 
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 &A57s 4G ఫోన్ల ఫీచర్స్ లీక్ అయ్యాయి

టిప్‌స్టర్ పారస్ గుగ్లానీ (@passionategeekz) ట్విట్టర్‌లో ఒప్పో A57s మరియు A57 4G స్పెసిఫికేషన్‌లతో ఒక ట్వీట్ ని విడుదల చేసారు. ఇందులోని సారాంశం ప్రకారం ఇవి గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ మరియు సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో అందించబడతాయని చెప్పబడింది. అవి రెండు విభిన్న (4GB + 64GB మరియు 6GB + 128GB) RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తాయి. లీక్ ప్రకారం రాబోయే ఒప్పో A57 4G ఫోన్ 6.56-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో G35 SoC ద్వారా శక్తిని పొందుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 &A57s 4G ఫోన్ల ఫీచర్స్ లీక్ అయ్యాయి

గుర్తుచేసుకుంటే కనుక ఒప్పో A57 (2022) ఇటీవలే థాయిలాండ్‌లో THB 5,499 (దాదాపు రూ. 12,500) ధర వద్ద లాంచ్ అయింది. ఇది గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ 4G మోడల్ భారతదేశంలో ఒప్పో A57 లేదా A57 4Gగా రీబ్రాండ్ చేయబడవచ్చు.

ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 &A57s 4G ఫోన్ల ఫీచర్స్ లీక్ అయ్యాయి

Oppo A57 (2022) 6.56-అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను ప్యాక్ చేస్తుంది. Oppo A57 (2022) 8-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఫోన్ యాక్సిస్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంటుంది. చివరిగా ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo A57 And Oppo A57s 4G Two Upcoming Phones to Launch in India Soon: Specifications Details Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X