హ్యాకింగ్‌కి గురైన ప్రధానమంత్రి ట్విట్టర్ ఎకౌంట్..

Posted By: Super

హ్యాకింగ్‌కి గురైన ప్రధానమంత్రి ట్విట్టర్ ఎకౌంట్..

టెక్నాలజీ ఏవిధంగా ప్రక్కదారి పడుతుందోనని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆదివారం ధాయ్‌లాండ్ ప్రధాని 'యింగ్లుచ్క్ శినివాత్ర' ట్విట్టర్ ఎకౌంట్ సుమారు ఇరవై నిముషాలు పాటు హ్యాకింగ్ చేయబడింది. అంతేకాకుండా ఈ ఎకౌంట్ ద్వారా సుమారు ఎనిమిది ట్వీట్ ఈ ఇరవై నిముషాల సమయంలో బయటకు రావడం జరిగింది.

యింగ్లుచ్క్ శినివాత్ర ధాయ్ లాండ్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మాదిరే యింగ్లుచ్క్ శినివాత్ర కూడా తన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం సోషల్ మీడియా వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ లను ఉపయోగించడం జరిగింది. ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత యింగ్లుచ్క్ శినివాత్ర తనయొక్క కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు గాను ట్విట్టర్ ఎకౌంట్‌ని విరివిగా వాడడం జరుగుతుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎకౌంట్ల ద్వారా దేశంలో ఏవైనా సమస్యలకు బదులు ఇవ్వడం, ప్రజలనుండి సమస్యలను తెలుసుకొవడం మొదలగునవి చేస్తున్నారు.

ఐతే హాఠాత్తుగా యింగ్లుచ్క్ శినివాత్ర యొక్క ట్విట్టర్ ఎకౌంట్‌ని హ్యాకర్స్ ఎవరో హ్యాక్ చేసి ఎనిమిది ట్వీట్స్‌ని పంపించగా ఒక్కసారిగా గవర్నమెంట్స్ అఫీసియల్స్ కంగు తిన్నారు. ఐతే ఈ ఎకౌంట్‌ని హ్యాక్ చేసింది ఎవరో కాదు, యింగ్లుచ్క్ శినివాత్ర యొక్క టీమ్ మెంబర్సేనని జకార్తా టైమ్స్ ప్రచురించడం జరిగింది. దీనివల్ల యింగ్లుచ్క్ శినివాత్ర యొక్క ట్విట్టర్ ఎకౌంట్(@pouyingluck) ప్రస్తుతానికి నిషేధించడం జరిగింది.

ఇది ఇలా ఉంటే యింగ్లుచ్క్ శినివాత్ర యొక్క ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని మాత్రమే యధావిధిగా ఉంచడం జరిగింది. ధాయ్ లాండ్ రాజకీయాలలో సోషల్ మీడియాని ఉపయోగించడం ఇదే మొదిటి సారి మాత్రం కాదు. గతంలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ధాయ్ లాండ్ మాజీ ప్రధాన మంత్రి అభిసిట్ వేజ్జజివ కూడా సోషల్ మీడియాని ఉపయోగించడం జరిగింది. అంతేకాదండోయ్ ప్రపంచంలో ఉన్న రాజీకీయనాయకులలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టాప్ టెన్ లీడర్స్‌లలో స్దానం కూడా సంపాదించుకున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot