ఐడియాలో వొడాఫోన్ విలీనం.. ఎయిర్‌టెల్, జియోలకు చెక్?

ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐడియా సెల్యులార్ లో వొడాఫోన్ ఇండియాను విలీనం చేసేందుకు ఆదిత్యా బిర్లా గ్రూపుతో చర్చల్లో ఉన్నట్లు వొడాఫోన్ ధృవీకరించింది. ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు సంబంధించి 42% వాటా మినహా అన్ని షేర్లను ఐడియాలో విలీనం చేసే అంశం పై ఆదిత్యా బిర్లా గ్రూపుతో చర్చలు ఉన్నట్లు వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐడియాలో వొడాఫోన్ విలీనం.. ఎయిర్‌టెల్, జియోలకు చెక్?

ఈ డీల్ విజయవంతమైనట్లయితే వొడాఫోన్, ఐడియా సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా 43శాతానికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 32%గా ఉంటుంది. ఇక సబ్‌స్కైబర్ కౌంట్ విషయానికి వచ్చేసరికి వొడాఫోన్, ఐడియాలు సంయుక్తంగా 39 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంటాయి. ఈ సంఖ్య ఎయిర్‌టెల్ 23 కోట్లు, రిలయన్స్ జియో యూజర్లు 7.2 కోట్ల యూజర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. మార్కెట్లో నెలకున్న పోటీని తట్టుకునేందుకే ఈ విలీనం పై చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్ తెలిపింది.

English summary
Vodafone in talks for a merger with Idea Cellular, confirms company. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot