BHIM యాప్‌ కొత్త ఫీచర్ ‘బిల్ పేమెంట్స్’

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత సరళతరం చేస్తూ భారత్ ప్రభుత్వంచే అఫీషియల్‌గా లాంచ్ చేయబడిన BHIM యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌ను అందుకుంది.

|

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత సరళతరం చేస్తూ భారత్ ప్రభుత్వంచే అఫీషియల్‌గా లాంచ్ చేయబడిన BHIM యాప్ లేటెస్ట్ అప్‌డేట్‌ను అందుకుంది. తాజా అప్‌డేట్‌లో భాగంగా భీమ్ యూప్ యూజర్లు అన్ని రకాల యుటిలిటీ బిల్స్‌ను తమ యాప్ నుంచే చెల్లించే వీలుంటుంది. ఈ బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను పొందాలనుకునే యూజర్లు తమ ఫోన్‌లోని భీమ్ యాప్‌ను వెర్షన్ 1.5కి అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్‌లోని 'What's New' సెక్షన్‌లో ఈ 'బిల్ పే' ఫీచర్ గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

సింగిల్ అకౌంట్లోనే అన్నీ సర్వీసులు, Airtel తొలి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్సింగిల్ అకౌంట్లోనే అన్నీ సర్వీసులు, Airtel తొలి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్

అన్ని రకాల యుటిలిటీ బిల్స్..

అన్ని రకాల యుటిలిటీ బిల్స్..

ఈ బిల్ పేమెంట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఎలక్ట్రసిటీ బిల్స్ దగ్గర నుంచి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్, గ్యాస్, వాటర్ ఇలా అన్ని రకాల బిల్లులను చెల్లించే వీలుంటుంది.

క్యూఆర్ కోడ్‌ సదుపాయంతో..

క్యూఆర్ కోడ్‌ సదుపాయంతో..

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ వినియోగదారులకు కల్పిస్తోంది. వ్యాపారులు కూడా ఈ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌లను జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్ కి నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు స్కాన్ ను టాప్ చేసి, యాప్ లోని పే బటన్ ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.

 ఫీచర్ ఫోన్‌లనూ సపోర్ట్ చేస్తోంది..

ఫీచర్ ఫోన్‌లనూ సపోర్ట్ చేస్తోంది..

ఫీచర్ ఫోన్ వాడుతున్న భీమ్ చెల్లింపులు కోసం మొదట *99# ను డయల్ చేయాలి. అనంతరం వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ కనిపిస్తుంది. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం నోక్కవలసిన వివిధ నంబర్లు మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి.

 స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఉదాహరణకు.. నగదు పంపించాలనుకుంటే, 1 నంబరు టైప్ చేసి, సెండ్ నొక్కాలి. ఎవరికి పంపించాలకున్నారో వారి మొబైల్ నంబరు టైపు చేసేందుకు మళ్ళీ 1 నంబరు నొక్కాలి. తర్వాత సదరు వ్యక్తి ఫోన్ నంబరు, చెల్లింపు మొత్తం టైపు చేసి 'పిన్'ను జనరేట్ చేసుకోవాలి.

Best Mobiles in India

English summary
BHIM apps for Android and iOS have now been updated to support in-app bill payments. Developed by National Payment Corporation of India (NPCI), BHIM was launched as a simple UPI-enabled payment interface, as a part of the Digital India initiative.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X