ఇకపై నిమిషాల్లో పాన్‌కార్డు మీ చేతికి

పాన్ పొందాల‌నుకుంటున్న వారికి సుల‌భంగా ఆ నెంబ‌రు వ‌చ్చేటట్లు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని స‌న్నాహాలు చేస్తోంది.

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ ద్వారా ప‌న్ను చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) అందించాలని భావిస్తోంది. పాన్ పొందాల‌నుకుంటున్న వారికి సుల‌భంగా ఆ నెంబ‌రు వ‌చ్చేటట్లు మ‌రిన్ని స‌న్నాహాలు చేస్తోంది. పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆ నెంబ‌రును అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు ఆధార్ ఈ-కేవైసీ సౌకర్యం ద్వారా పాన్‌ జారీ చేయాలని భావిస్తోంది. వేలి ముద్ర ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్‌ విధానంతో ఇది ప‌నిచేస్తుంది.

 

హానర్ 6X, బెస్ట్ అనేందుకు కొన్ని కారణాలు

పాన్ కార్డు జారీకి ..

పాన్ కార్డు జారీకి ..

ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు సిమ్ కార్డు జారీ చేయ‌డానికి ఉప‌యోగిస్తోన్న ప్ర‌క్రియ‌నే తాము పాన్ కార్డు జారీకి అనుసరించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

నిమిషాల్లో పాన్ నంబర్‌ జారీ

నిమిషాల్లో పాన్ నంబర్‌ జారీ

ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా పాన్ నంబర్‌కు దరఖాస్తు చేసుకున్నవారి చిరునామా, పుట్టిన తేదీని బయోమెట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని, తద్వారా నిమిషాల్లో పాన్ నంబర్‌ను జారీ చేయవచ్చని చెప్పారు.

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా..

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా..

ఏటా దాదాపు రెండున్నర కోట్ల మంది కొత్తగా పాన్‌ కార్డులు తీసుకుంటున్నారు. ఐటి శాఖ అభివృద్ధి చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా పాన్‌ కార్డులు తీసుకునే వారి సంఖ్య మరింత పెరిగి, మరింత మందిని పన్నుల చెల్లింపు పరిధిలోకి తేవచ్చని అధికార వర్గాల అంచనా.

పాన్‌ కార్డు నెంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి
 

పాన్‌ కార్డు నెంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి

ప్రభుత్వం ఇప్పటికే రూ.50,000 మించిన నగదు ఉపసంహరణ, రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకు పాన్‌ కార్డు నెంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి చేసింది. కొత్త యాప్‌తో దేశంలో ఆదాయ పన్ను చెల్లింపుల వ్యవస్థ మరింత కట్టుదిట్టమవుతుందని భావిస్తున్నారు.

2.5 కోట్ల మంది దరఖాస్తు

2.5 కోట్ల మంది దరఖాస్తు

పాన్‌కార్డు కోసం ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, త్వరలో తీసుకురానున్న నూతన విధానంతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఆధార్ కార్డు ద్వారా ప్రజలు ఇప్పటికే సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, సబ్సిడీలు పొందుతున్నారని గుర్తు చేశారు.

మొబైల్ యాప్‌ ద్వారా

మొబైల్ యాప్‌ ద్వారా

మొబైల్ యాప్‌ ద్వారా పన్ను చెల్లింపులే కాకుండా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, రిటర్న్‌లు ట్రాక్‌ చేసుకునే వీలు కల్పించ‌నున్నామ‌ని పేర్కొన్నారు.

 

 

Best Mobiles in India

English summary
IT Department Making App to Pay Income Tax, Apply for PAN Card, and More read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X