శాంసంగ్ పే యాప్, పేటీఎంకు సవాలేనా..?

Written By:

భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా డిజిటల్ వ్యాలెట్ యాప్ ల బిజినెస్ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. పేటీఎమ్ అయితే నోట్ల రద్దు దెబ్బతో ఒక్కసారిగా దూసుకుపోయింది కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ పేటీఎమ్ ని వాడుతున్నారు. అయితే ఇప్పుడు పేటీఎమ్ కి సవాల్ విసిరేందుకు శాంసంగ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. శాంసంగ్ తన పేమెంట్ యాప్ ని అతి త్వరలో ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది.

ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2017 నాటికల్లా

2017 నాటికల్లా శాంసంగ్ తన మొబైల్ పేమెంట్ యాప్ శాంసంగ్ పేని ఇండియాకు తీసుకురావాలని చూస్తోంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది దీన్ని ఇండియాలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండియా మార్కెట్ లోకి

నోట్ల రద్దుతో పేటీఎమ్, ఫ్రీ చార్జ్ లాంటి వ్యాలెట్ యాప్ లు ఒక్కసారిగా పుంచుకోవడంతో శాంసంగ్ దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇండియా మార్కెట్ లోకి తన శాంసంగ్ పే యాప్ ద్వారా రావాలని వ్యూహాలు రచిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాగ్నిటిక్ సెక్యూర్ ట్రాన్సిమిషన్ సపోర్ట్ తో

అయితే రానున్న ఈ శాంసంగ్ పే యాప్ మాగ్నిటిక్ సెక్యూర్ ట్రాన్సిమిషన్ సపోర్ట్ తో రానుంది. ఇదే విషయాన్ని శాం మొబైల్ రిపోర్ట్ చేసింది. ట్రేడిషనల్ కార్డు స్వైపింగ్ మెథడ్ తో పేమెంట్ చేయవచ్చని NFC-equipped నుంచి ఉపశమనం పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

మాగ్నటిక్ సిగ్నల్

ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఎక్కడైనా కార్డు స్వైప్ చేసినప్పుడు మీ మొబైల్ కి మాగ్నటిక్ సిగ్నల్ అందుతుంది. అన్ని పేమెంట్లు దీని ద్వారా జరపుకోవచ్చని ప్రతి పేమెంట్ కి మాగ్నటిక్ సిగ్నల్ వస్తుందని కంపెనీ చెబుతోంది.

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో

శాంసంగ్ తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఈ సర్వీసును అందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన అన్ని శాంసంగ్ ఫోన్లకు ఈ యాప్ సర్వీసు అప్ డేట్ ఇవ్వనుంది. ఈ సర్వీసు ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా,చైనా , రష్యా, సింగపూర్ ,సౌత్ కొరియా ,స్పెయిన్ ,యుఎస్ లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Pay to come to India in early 2017 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot