ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత డేటా

Written By:

కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ఎకానమీకి మద్దతుగా గ్రామీణ ఫ్రాంతాల్లో ఫోన్ వాడే యూజర్లకు నెలవారిగా కొంత ఉచిత డేటాను అందించాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదించింది. దీనికోసం ఓ పథకాన్ని ఏర్పాటు చేసి దీని అమలుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) నుంచి నిధులు సమకూర్చాలని ప్రభుత్వానికి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సూచించింది.ఉచిత డేటాను అందించే కంపెనీలు దీనికోసం కొన్ని రూల్స్ పాటించాలని చెప్పింది.

6జిబి ర్యామ్‌తో కూల్ ఛేంజర్ S1, ధర తక్కువే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందించాలనుకునే కంపెనీలు

ఉచిత డేటాను అందించాలనుకునే కంపెనీలు .. టెలికం శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవి ఇండియన్ కంపెనీస్ యాక్ట్, 1956 కింద రిజిస్టర్ అయ్యిండాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిజిస్ట్రేషన్ వాలిడిటీ ఐదేళ్లు

ఇక రిజిస్ట్రేషన్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక కంపెనీ తన రిజిస్ట్రేషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరేఇతర సంస్థలకు బదిలీ చేయకూడదని ట్రాయ్ పేర్కొంది.

ఉచిత డేటాను అందించే కంపెనీలకు

ఇలా ఉచిత డేటాను అందించే కంపెనీలకు వచ్చే నష్టాలను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి చెల్లించాలని ట్రాయ్ పేర్కొంది.

ఈ ప్రాంతాల్లో డేటా సేవలకు

ఇప్పటికే గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించే కంపెనీలకు వచ్చే నష్టాల్లో కొంత భాగాన్ని ఈ నిధి నుంచి చెల్లిస్తున్నారు. ఇపుడు ఈ ప్రాంతాల్లో డేటా సేవలకు కూడా ఈ నిధి నుంచి ఖర్చు చేయాలని ట్రాయ్ సిఫారసు చేసింది.

నెలకు 100 ఎంబీ డేటాను

ట్రాయ్ సూచించిన వివరాల ప్రకారం నెలకు 100 ఎంబీ డేటాను కంపెనీలు ఉచితంగా అందించే అవకాశం ఉంది. డిజిటల్ యుగం వైపు అడుగులు వేయడానికి ఈ నిర్ణయం అనుకూలిస్తుందని ట్రాయ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
For cashless economy: TRAI recommends limited free data to rural subscribers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot