వాట్సాప్ లో కొత్త Proxy ఫీచర్ ! ఇంటర్నెట్ షట్ డౌన్ లో కూడా మెసేజ్ లు పంపొచ్చు!

By Maheswara
|

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ సర్వీస్ లకు ప్రాక్సీ సపోర్టు ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కొత్త Proxy ఫీచర్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు కంపెనీ సర్వర్‌లకు వారి కనెక్షన్ బ్లాక్ చేయబడినా లేదా అంతరాయం కలిగినా కూడా వాట్సాప్ ని ఉపయోగించడం కొనసాగించవచ్చు. ప్రాక్సీ ని ఉపయోగించడం వలన వినియోగదారులు స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు మరియు సంస్థలు ఏర్పాటు చేసిన సర్వర్‌ల ద్వారా వాట్సాప్ కు కనెక్ట్ అవ్వడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

 

ఈ కొత్త ఫీచర్ ఏమిటి ?

ఈ కొత్త ఫీచర్ ఏమిటి ?

వాట్సాప్ సమాచారం ప్రకారం, ప్రాక్సీ ఫీచర్ ఉపయోగించడం అనేది సాధారణ యాప్ లాగే  అదే స్థాయి ప్రైవసీ మరియు భద్రతను కలిగి ఉంటుంది మరియు వ్యక్తిగత మెసెజ్ లను   ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంచుతారు.

ఈ కొత్త ఫీచర్ ఎందుకు?

ఈ కొత్త ఫీచర్ ఎందుకు?

దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి నిరసనకారులు వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు అనే ఆరోపణలతో 2022లో ఇరాన్ స్థానిక ప్రభుత్వం వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ల యాక్సెస్‌ను బ్లాక్ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి వాట్సాప్ "ఈ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగినప్పుడు కూడా వాట్సాప్ పనిచేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది "

ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?
 

ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?

"2023 లో మా కోరిక ఏమిటంటే, ఈ ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు ఎప్పుడూ జరగకూడదనేది" అని వాట్సాప్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పోస్ట్ చేసింది. "మేము ఇరాన్‌లో చూసినట్లుగా నెలల తరబడి  అంతరాయాలు ప్రజల మానవ హక్కులను నిరాకరిస్తాయి మరియు అత్యవసర సహాయం పొందకుండా ప్రజలను కత్తిరించాయి. ఒకవేళ ఈ షట్‌డౌన్‌లు కొనసాగుతున్నప్పటికీ, సురక్షితమైన కమ్యూనికేషన్ అవసరం ఉన్న వ్యక్తులకు ఈ పరిష్కారం సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము." అని వివరించారు.

మీ సొంత ప్రాక్సీ సర్వర్లను కూడా వాడవచ్చు

మీ సొంత ప్రాక్సీ సర్వర్లను కూడా వాడవచ్చు

స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం వారి స్వంత ప్రాక్సీ సర్వర్‌ను రూపొందించడానికి ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం WhatsApp ఒక గైడ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌లోని స్టోరేజ్ మరియు తేదీ సెట్టింగ్‌లలోకి వెళ్లడం ద్వారా వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ ఆప్షన్ ను చూడవచ్చు. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రాక్సీ సర్వర్ సపోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ను మీరు చూడాలంటే మొదట మీరు వాట్సాప్ యొక్క తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేశారని నిర్ధారించుకోండి. ప్రాక్సీ సర్వర్లు, వాట్సాప్ మరియు మాతృ సంస్థ మెటాతో సహా మధ్యలో ఎవరికీ మెసెజ్ లు రావని కంపెనీ పేర్కొంది.

యాప్ యొక్క తాజా అప్డేట్ ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులందరికీ, సెట్టింగ్‌ల మెనులో కొత్త ఎంపిక అందుబాటులో ఉంటుంది. WhatsApp ప్రకారం, ఎవరైనా ఇంటర్నెట్ కలిగి  ఉంటే, ప్రాక్సీని సెటప్ చేసే విశ్వసనీయ మూలాల కోసం సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజిన్‌లను బ్రౌజ్ చేయవచ్చు.

ప్రాక్సీ ని లింక్ చేయడం ఎలా ?

ప్రాక్సీ ని లింక్ చేయడం ఎలా ?

ప్రాక్సీకి లింక్ చేయడానికి ఈ పద్దతిని పాటించండి WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి, స్టోరేజ్ మరియు డేటాను నొక్కి, ఆపై ప్రాక్సీని ఎంచుకోవాలి. ఆపై, ప్రాక్సీని ఉపయోగించండి నొక్కండి, ప్రాక్సీ చిరునామాను పూరించండి మరియు సేవకు కనెక్ట్ చేయడానికి సేవ్ చేయి ఎంచుకోండి.

వాట్సాప్ చాట్ లో మెసెజ్ లను టాప్ లో పిన్ చేసే ఫీచర్ ను కూడా ఇటీవల బీటా వెర్షన్ లో  లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Proxy Support Feature Officially Launched. Users Now Can Bypass Internet Shutdowns.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X