ఫోటోల వెనుక దాగిన వాస్తవాలు ఎంతమందికి తెలుసు ?

By Anil
|

ప్రపంచంలో రోజుకి చాలా విషయాలు జరుగుతుంటాయి అవన్నీ మనం కంటితో చూడడానికి కన్నా కెమెరా కన్నుతో బంధించాలి అని అనుకుంటాం. మనుషుల సైకాలజీ ప్రకారం కొంతమంది ఆనంద పరిచే ఫొటోస్ తీస్తుంటారు మరి కొందరు మనసు కదిలించే ఫొటోస్ ను తీస్తుంటారు. అయితే కొన్ని ఫోటోల వెనుక వాస్తవాలు దాగుంటాయి.ఈ శీర్షిక లో భాగంగా అలాంటి 10 ఐకానిక్ ఫొటోస్ ను మీకు చూయిస్తున్నాం ఆసక్తి ఉన్నవారు ఓ లుక్కేయండి.

 

సెనేటర్ జాన్ F. కెన్నెడీ మరియ జాక్విలిన్ బౌవియెర్:

సెనేటర్ జాన్ F. కెన్నెడీ మరియ జాక్విలిన్ బౌవియెర్:

1953 లో వెకేషన్ టైంలో జాన్ F. కెన్నెడీ మరియ జాక్విలిన్ బౌవియెర్ పడవలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటో. లైఫ్ మ్యాగజైన్లో కనిపించిన ఈ ఫోటో, కెన్నెడీను నేషనల్ ఫిగర్ ను చేయడానికి సహాయపడింది.

పత్తి మిల్లో పనిచేసిన 13 ఏళ్ళ  అమ్మాయి ఫోటో:

పత్తి మిల్లో పనిచేసిన 13 ఏళ్ళ అమ్మాయి ఫోటో:

నార్త్ కరోలినాలోని ఒక పత్తి మిల్లో పనిచేసిన 13 ఏళ్ళ అమ్మాయి ఫోటో ఇది.ఈ ఫొటోను లూయిస్ హైన్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరా లో బంధించింది. U.S.A లో బాల కార్మికులను నిరోధించే చట్టాలను ఆమోదించడానికి హైన్ యొక్క చిత్రాలు కీలకపాత్ర పోషించాయి.

ఈస్టర్న్  కాంగో, విరుంగా నేషనల్ పార్క్:
 

ఈస్టర్న్ కాంగో, విరుంగా నేషనల్ పార్క్:

2007 లో ఈస్టర్న్ కాంగో, విరుంగా నేషనల్ పార్క్,తిరుగుబాటుదారుల కాల్పుల్లో చనిపోయిన నాలుగు గొరిల్లాల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న స్థానికులను తీసిన ఫోటో.

ఆఫ్ఘన్ అమ్మాయి:

ఆఫ్ఘన్ అమ్మాయి:

1984 లో ఫోటోగ్రాఫర్ Steve McCurry ఈ ఫోటో ను తీసాడు. నవంబరు 30, 2012 న న్యూ యార్క్ లో జరిగిన The National Geographic Collection మరియు The Art of Exploration వేలం లో భాగంగా ఈ ఫోటోను ప్రదర్శించారు.

ఇద్దరు పిల్లలు భయంతో  పరిగెడ్తున్న దృశ్యం:

ఇద్దరు పిల్లలు భయంతో పరిగెడ్తున్న దృశ్యం:

దక్షిణ వియత్నాం సైగాన్కు 26 మైళ్ళు నైరుతి దూరంలో ఉన్న ట్రాంగ్ బ్యాంగ్పై నాపామ్ దాడి జరిగిన తరువాత హైవే 1 పై ఇద్దరు పిల్లలు భయంతో పరిగెడ్తున్న దృశ్యాన్ని వియత్నామీస్-అమెరికన్ చెందిన ఫోటోగ్రాఫర్ తన కెమెరా లో బందిచిన ఫోటో.

ఎర్త్ రైజ్ :

ఎర్త్ రైజ్ :

ఆస్ట్రోనాట్ విలియం అండర్స్ చంద్రుని వెనక నుండి రైజ్ అవుతున్న ఎర్త్ ను ఫోటో తీశారు .1968 లో చంద్రునిపై అపోలో 8, మొట్టమొదటి మనుషులు చేసిన మిషన్ లూనార్ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతునాతున్నారు . అందులో భాగంగా వారు భూమి మరియు చంద్రుని చిత్రాలను వారు అంతరిక్షం నుండి చూసినట్లు చూపించారు.

నల్ల జాతీయుల పవర్ సెల్యూట్:

నల్ల జాతీయుల పవర్ సెల్యూట్:

1968 ఒలంపిక్ క్రీడల్లో, అమెరికన్ స్ప్రింటర్లు టామీ స్మిత్ మరియు జాన్ కార్లోస్ మెక్సికో నగరంలో వారి పిడికిలిను బిగిస్తూ పవర్ సెల్యూట్ చేస్తున్నపుడు తీసిన ఫోటో.ఈ పవర్ సెల్యూట్ ను యునైటెడ్ స్టేట్స్ లో నల్ల జాతీయుల పై జాతి వివక్ష చేస్తునందుకు చేసారు.

Muhammad Ali vs. Sonny Liston:

Muhammad Ali vs. Sonny Liston:

1965 లో జరిగిన బాక్సింగ్ కాంపిటీషన్ లో హెవీ వెయిట్ ఛాంపియన్ Muhammad Ali తన ప్రద్యర్థి అయిన Sonny Listonను తిడుతున్న ఫోటో.

పుట్టగొడుగు మేఘం:

పుట్టగొడుగు మేఘం:

బికిని అటోల్, మైక్రోనేషియాలో అమెరికన్ సైనికదళం చేత అణు ఆయుధ పరీక్ష ద్వారా సృష్టించబడిన అపారమైన పుట్టగొడుగు మేఘాన్ని కెమెరా లో బంధించారు.

ఫ్లోరెన్స్ ఓవెన్స్ థాంప్సన్ :

ఫ్లోరెన్స్ ఓవెన్స్ థాంప్సన్ :

32 వయసు గల ఫ్లోరెన్స్ ఓవెన్స్ థాంప్సన్ తన పిల్లలకు దూరం అవుతున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చాలామంది అమెరికన్లకు డిప్రెషన్ కు చిహ్నంగా వచ్చింది.

Best Mobiles in India

English summary
10 Iconic Photographs That Captured the World’s Imagination.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X