24 MP, 4k వీడియో రికార్డింగ్ తో Canon EOS M50

కెనాన్ ఎంట్రీ లెవల్ వినియోగదారులకోసం మిర్రర్ లెస్ కెమరా గా EOS M50 ని లాంచ్ చేసింది. మరియు తన M సెరిస్ లో వస్తున్న మొదటి 4k వీడియో రికార్డింగ్ కెమరాగా పేర్కొనింది.

|

కెనాన్ ఎంట్రీ లెవల్ వినియోగదారులకోసం మిర్రర్ లెస్ కెమరా గా EOS M50 ని లాంచ్ చేసింది. మరియు తన M సెరిస్ లో వస్తున్న మొదటి 4k వీడియో రికార్డింగ్ కెమరాగా పేర్కొనింది. ఈ కెమరా ఏప్రిల్ మాసం నుండి రీటైల్ షాపుల్లో $780 (సుమారు 50,600)కు అందుబాటులో ఉండనుంది. EF-M 15-45mm f/3.5-6.3 IS STM lens తో తీసుకున్న ఎడల $900(సుమారు 58,400rs) గా, లేదా EF-M 15-45mm f/3.5-6.3 IS STM మరియు EF-M 55-200mm f/4.5-6.3 IS STM లెన్స్ తో తీసుకుంటే $1249(సుమారు 81,000rs) గా ఉండనుంది.

EOS M50, 24.1 మెగా పిక్సెల్ కెమరా తో APS-C CMOS సెన్సార్ , మరియు DIGIC 8 ఇమేజ్ ప్రాసెసర్ని కలిగి ఉంటుంది. ఈ కెమరాతో 4k వీడియోలు చిత్రీకరించునప్పుడు, అత్యధికంగా 120 FPS (ఫ్రేమ్ పర్ సెకండ్) తో హై డెఫినిషన్ వీడియోలను తీయగలదు. ఇందులో touch-and-drag autofocus system తో కూడిన OLED electronic viewfinder (EVF) అంతర్గతంగా పొందుపరచబడి ఉంటుంది. మరియు articulating touchscreen LCD display, Dual Pixel autofocus system లతో పాటు సౌండ్ లేకుండా సైలెంట్ మోడ్ లో ఫోటోలు తీసే వీలు కల్పించబడినది. ఇందులో wifi, NFC, బ్లూటూత్ ఫీచర్స్ పొందికకాబడి రిమోట్ షూటింగ్, ఇమేజ్ షేరింగ్ కొరకు స్మార్ట్ ఫోన్ డివైసులకి కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

భారీ పుల్ వ్యూ డిస్‌ప్లే‌తో Moto G6, లీకయిన ధర, ఫీచర్లుభారీ పుల్ వ్యూ డిస్‌ప్లే‌తో Moto G6, లీకయిన ధర, ఫీచర్లు

Canon EOS M50 Entry-Level Mirrorless Camera

దీనితో పాటు కెనాన్, EOS Rebel T7 (EOS 2000D) ను కూడా అనౌన్స్ చేసింది. APS-C sensor, optical viewfinder మరియు అంతర్గతంగా పొందికకాబడిన wireless connectivity options తో కూడుకుని ఉన్న ఎంట్రీ లెవల్ DSLR గా ఈ మోడల్ అందుబాటులోకి వస్తుంది. దీనిని అమెరికాలో ఏప్రిల్ నెలలో EF-S 18-55mm F3.5-5.6 IS II lens తో $550(సుమారుగా 35,700rs) కు అందుబాటులోకి రానుంది.

"మా వినియోగదారులకు ఎంట్రీ స్థాయిలో అధిక నాణ్యతా లక్షణాలు కలిగి ఉన్న మార్చుకోగలిగిన కెమెరా లెన్స్ లు అభివృద్ధి చేయడమే మా లక్ష్యం, తద్వారా రెండు రకాల లెన్స్ లను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. మా వినియోగదారుల కోరికమేరకు EOS M50, EOS రెబెల్ T7 ద్వారా ఆ లక్ష్యాన్ని మేము సాధించగలిగాము అని "COO అద్యక్షుడు , canonUSA.inc యూజి ఇషిజూకా తెలిపారు " . ఫోటోగ్రఫీ లో అన్నిరకాల సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడానికి కావలసిన మెరుగైన నాణ్యతని సాధించడానికి ఈ రెండు కెమరాలు దోహదపడగలవని, తద్వారా హై క్వాలిటీ ఫోటోలను తీయగలిగే అవకాశాలను ఫోటోగ్రాఫర్స్ కి అందివ్వగలవని ఆకాంక్షించారు.

Best Mobiles in India

English summary
Canon EOS M50 Entry-Level Mirrorless Camera Launched With 24.1-Megapixel Sensor, 4K Video Recording More news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X