సోనీ నుంచి మరో సంచలన కెమెరా ‘A7R III’

మిర్రర్‌లెస్ కెమెరాల తయరీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సోనీ తాజాగా తన A7 సిరీస్ నుంచి సరికొత్త కెమెరాను యూఎస్ మార్కెట్లో అనౌన్స్ చేసింది.

|

మిర్రర్‌లెస్ కెమెరాల తయరీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సోనీ తాజాగా తన A7 సిరీస్ నుంచి సరికొత్త కెమెరాను యూఎస్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. A7R III పేరుతో ఈ కెమెరా అందుబాటులో ఉంటుంది. 2015లో లాంచ్ అయిన A7R II కెమెరాకు ఇది అప్‌గ్రేడ్ మోడల్ అని సోనీ వెల్లడించింది.

Sony A7R III launched, shipping starts in November

కంఫర్టబుల్ బాడీ, ఆకట్టుకునే ఆన్-చిప్ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ సిస్టం, ఫైవ్-యాక్సిస్ ఇన్-బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, బెటర్ థర్డ్ పార్టీ లెన్స్ సపోర్ట్, ఇన్-కమెరా 4కే వీడియో క్యాప్చుర్ వంటి ఫీచర్లు A7R II కెమెరాను అప్పట్లో మార్కెట్ నెం.1గా నిలబట్టాయి. ఈ కెమెరాకు కొనసాగింపుగా మార్కెట్లో లాంచ్ అయిన A7R III స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

రియలిస్టిక్ అనుభూతులతో LG అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌రియలిస్టిక్ అనుభూతులతో LG అల్ట్రావైడ్ గేమింగ్ మానిటర్స్‌

A7R III కెమెరా 42.2 మెగాపిక్సల్ BSI CMOS సెన్సార్‌తో వస్తోంది. నూతనంగా అమర్చిన ఫ్రంట్-ఎండ్ LSI, సెన్సార్ స్పీడ్‌ను రెట్టింపు చేస్తుందని సోనీ చెబుతోంది. ఈ కెమెరాలో అమర్చిన BIONZ X ఇమేజ్ ప్రాసెసర్ A7R II కెమెరాలో అమర్చిన ఇమేజ్ ప్రాసెసర్‌తో పోలిస్తే 1.8 రెట్టు వేగంగా స్పందించగలదట.

ఈ కెమెరాలో burst షూటింగ్ రేట్ 10fpsగా ఉంటుందట. కెమెరాలో ISO వాల్యూను 25600 నుంచి 32000 పెంచినట్లు కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్‌లో రెండు రకాల పేజీలుఫేస్‌బుక్‌లో రెండు రకాల పేజీలు

రూ. 89 వేల ఫోన్ సైతం out of stock, దుమ్మురేపిన ఆపిల్రూ. 89 వేల ఫోన్ సైతం out of stock, దుమ్మురేపిన ఆపిల్

కెమెరా రేర్ ప్యానల్ భాగంలో అమర్చిన జాయ్ స్టిక్ ద్వారా ఈజీ నేవిగేషన్‌తో పాటు సౌకర్యవంతంగా ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకునే వీలుంటుందని సోనీ చెబుతోంది. 3 అంగుళాల టచ్ స్ర్కీన్‌తో వస్తోన్న ఈ కెమెరా ద్వారా హై-క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చట. A7R III కెమెరా నవంంబర్ నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. ధర $3,200 (ఇండియన్ కరెన్సీలో రూ.2,08,100).

Best Mobiles in India

English summary
Sony A7R III is the latest addition to its A7 series of mirrorless cameras. The camera will start shipping in November for $3200 (approx. Rs. 2,08,100)

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X