రూ.22 వేలకు అసుస్ ల్యాప్‌టాప్

Written By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం అసుస్ ఇండియా మార్కెట్లో తన నూతన ల్యాపీ VivoBook X507 notebook rangeను లాంచ్ చేసింది. తక్కువ బరువుతో ఆకట్టుకునే నానో ఎడ్జ్ డిస్ ప్లేతో X507 notebook range ల్యాపీ వచ్చింది. ఈ ల్యాపీ పేటీఎమ్ మాల్ లో ఎక్స్ క్లూజివ్ గా అమ్మకానికి వచ్చింది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు దీన్ని పేటీఎమ్ మాల్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ధరను కంపెనీ రూ.21,990గా నిర్ణయించింది. వివోబుక్ ఎక్స్507ను కొనుగోలు చేసిన వారికి పేటీఎంలో రూ.2వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

రూ.22 వేలకు అసుస్ ల్యాప్‌టాప్

ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 6వ జనరేషన్ ప్రాసెసర్, 2 జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, 1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, విండోస్ 10 ఓఎస్, వీజీఏ వెబ్ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 256GB/ 128GB SSD support చేసే స్లాట్ ఉంది.

VivoBook X507 వివిధ వేరియంట్లలో రాగా దీని స్టార్టింగ్ ధర రూ. 21,990 గాఉంది. Intel Core i3 and Nvidia GeForce MX110 GPU, 8GB RAM ల్యాపీ ధర రూ. 38,990గా నిర్ణయించారు.

జాబ్స్ సునామి, జియో నుంచి 80 వేలు,కేంద్రం నుంచి 40 లక్షల ఉద్యోగాలు,త్వరలో నోటిఫికేషన్ !

కాగా అసుస్ కంపెనీ ఈ మధ్య కాలంలో ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంగా తన స్మార్ట్ ఫోన్ అమ్మకాలను కొనసాగిస్తున్న సంగతి అందరికీ విదితమే. అయితే ల్యాపీలు మాత్రం పేటీఎమ్ మాల్ కేంద్రంగానే విక్రయిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలపై కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

ఈ ల్యాపీ ధరలో ఇంటెల్ ల్యాపీలు మాత్రమే వినియోగదారులకు లభిస్తున్నాయి. Intel Pentium N5000 quad-core processor ఇలాంటి ఫీచర్లతోనే వచ్చినా దీని ధర మూత్రం రూ. 24,990గా ఉంది. కాగా 6th generation Intel Core i3 processor ధర రూ. 27,990గా ఉంది. ఇందులో 4జిబి ర్యామ్ మాత్రమే పొందుపరిచారు.

English summary
Asus VivoBook X507 With 15.6-Inch Display, Up to 8GB RAM Launched in India as Paytm Mall Exclusive: Price, More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot