భారీ డిస్‌ప్లేతో దిగ్గజాలకు దడపుట్టిస్తున్న LG

Written By:

ప్రముఖ దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ప్రపంచంలోనే మొదటి సారిగా 88 ఇంచుల సైజ్ ఉన్న 8కె ఓలెడ్ డిస్‌ప్లేను ఆవిష్కరించింది.అయితే ఇది అతి త్వరలోనే వినియోగదారులకు చేరువ కానుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ డిస్‌ప్లే‌లను పరిమితస్థాయిలో మాత్రమే కంపెనీ ఆఫర్ చేయనుంది. జనవరి 9 నుంచి 12 మధ్యలో లాస్ వెగాస్ లో జరగనున్న CES 2018 కాన్ఫరెన్స్ లో దీన్ని ప్రదర్శనకు ఉంచనుంది.

పుల్ వ్యూ డిస్‌ప్లేతో బ్లేడ్ వీ9, ఆండ్రాయిడ్ ఓరియోతో..

భారీ డిస్‌ప్లేతో దిగ్గజాలకు దడపుట్టిస్తున్న LG

ఇందులో 33 మిలియన్ పిక్సల్స్ (7680 x 4320 పిక్సల్స్) భారీ రిజల్యూషన్ ఉంది. ఫుల్ హెచ్‌డీ (1920 x 1080 పిక్సల్స్) స్క్రీన్ రిజల్యూషన్ కన్నా దాదాపుగా 16 రెట్ల ఎక్కువ రిజల్యూషన్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. అల్ట్రా హెచ్‌డీ (3840 x 2160 పిక్సల్స్)తో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ రిజల్యూషన్ ఈ డిస్‌ప్లేలో ఉంటుంది. కాగా ఈ డిస్‌ప్లే ధరను ఎల్‌జీ ఇంకా వెల్లడించలేదు.

English summary
LG unveils world's first 88-inch 8K OLED display More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot