ఈ ఏడాదంతా..డ్రోన్స్ దే హవా!

By Madhavi Lagishetty
|

ఈ ఏడాదంతా...డ్రోన్స్ దే హవా కొనసాగునుంది. రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ వెలువరిచిన నివేదిక ప్రకారం, కమర్షియల్ సెక్టర్లో డ్రోన్ మార్కెట్ వేగంగా పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా 2018లో CY సోలార్ మార్కెట్ వ్యాలూవ్ 45శాతం పెరుగుతుందని రిపోర్టులో పేర్కొంది.

 
ఈ ఏడాదంతా..డ్రోన్స్ దే హవా!

ధరల తగ్గింపు, టెక్నికల్ ఇన్నోవేషన్స్ కారణంగా కొలిచే ఎగవేత, ఆటోనమస్ ఫ్లైయిట్ మోడ్, హోం రిటర్న్, ఫస్ట్ పర్సన్ వ్యూ లాంటి ఇతర అప్లికేషన్స్ లో ఉపయోగించడానికి డ్రోన్స్ సులభమైన సిస్టమ్ ను కలిగి ఉన్నాయి. అందుకే రానున్న రోజుల్లో డ్రోన్స్ వాడకం అనేది పెరగనుంది.

డ్రోన్స్ ఎక్కువగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ఉపయోగిస్తుంటారు. వీటివల్లే డ్రోన్స్ వేగంగా డెవలప్ అయ్యాయని చెప్పవచ్చు. అంతేకాదు డ్రోన్స్ ఇప్పుడు మార్కెట్లో ఒక బలమైన వాణిజ్య అప్లికేషన్ను కనుగొనడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

ఇక మల్టీపుల్ ఇండస్ట్రీయల్ విభాగాల్లో వీటితో చాలా ఉపయోగాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అంత్యంత ముఖ్యమైన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో డ్రోన్స్ సత్తా చాటుతున్నాయి. చాలా కంపెనీలు ఏరియల్ ఫుటేజ్ కోసం ఎక్కువగా డ్రోన్స్ పై ఆధారపడుతున్నాయి.

కేవలం ఫోటో, వీడియో గ్రఫీ కోసమే కాదు వ్యవసాయం నుంచి పవర్, భీమా, మైనింగ్ వీటన్నింటి కోసం డ్రోన్స్ వాడుతున్నారు. వీటితో గణనీయమైన లాభాలను పొందుతున్నారు. అంతేకాదు ఎమర్జెన్సీ సపోర్టు సర్వీసును అందించడానికి ప్యాకేజీ డెలివరీ కోసం అనేక సంస్థలు డ్రోన్లను టెస్ట్ చేస్తున్నాయి.

ఫ్లుట్టీ, జిప్లైన్ వంటి ప్రాంతాల్లోకి క్లిష్ట పరిస్థితుల్లో డ్రోన్స్ చేరుకునేందుకు రిమోట్ సహాయంతో వీటీని ఆపరేట్ చేస్తారు. అంతేకాదు ఆహారం, నీరు సరిగ్గా అందలేని పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలకు చేరుకునేందుకు ఎక్కువగా డ్రోన్స్ నే వినియోగిస్తున్నారు.

భారీగా తగ్గిన కూల్‌ప్యాడ్ ఫోన్ల ధరలు, రూ. 6 వేలతో మొదలు..భారీగా తగ్గిన కూల్‌ప్యాడ్ ఫోన్ల ధరలు, రూ. 6 వేలతో మొదలు..

ప్రస్తుతం కమర్షియల్ సెగ్మెంట్లో ప్రధానంగా మీడియా, ఎంటర్ టైన్మెంట్, వ్యవసాయం, కన్స్రక్షన్స్ కోసం డ్రోన్స్ వాడకం అనేది ఎక్కువైంది. భీమా, టెలికాం వంటి అభివ్రద్ధి చెందుతున్న రంగాల్లో కూడా కమర్షియల్ డ్రోన్ వినియోగం క్రమక్రమంగా పెరుగుతుంది.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, కమర్షియల్ డ్రోన్ హార్డ్ వేర్ మార్కెట్ 2020 నాటికి 0.7బిలియన్ల డాలర్లు ఉండవచ్చని అంచనా వేసింది. ఇది CAGR వద్ద 33శాతం పెరిగింది. వినియోగదారుల డ్రోన్ సెగ్మెంట్ తో పోల్చి చూసినట్లయితే సెల్లింగ్ ధర దాదాపు రెట్టింపు అయ్యిందని పేర్కొంది. అంటే రానున్న రోజుల్లన్నీ డ్రోన్స్ వే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Best Mobiles in India

Read more about:
English summary
Drone delivery is often positioned as a promising area of drone deployment. Several companies are testing their potential ranging from package delivery (Amazon Prime Air) to providing emergency support services.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X