Lenovo కొత్త 5G టాబ్లెట్ ఇండియాలో లాంచ్ అయింది! ధర మరియు సేల్ వివరాలు!

By Maheswara
|

Lenovo భారతదేశంలో దాని టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోకి మరొక సరి కొత్త ప్రీమియం టాబ్లెట్ Lenovo Tab P11 5G ని జోడించింది. దాని పేరుకు తగినట్లుగానే ఈ కొత్త టాబ్లెట్, 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది మరియు వేగవంతమైన వేగాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది పెద్ద 11-అంగుళాల IPS LCD, డాల్బీ విజన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, JBL స్పీకర్లు మరియు ఇతర లక్షణాలతో పాటు పెద్ద 7700mAh బ్యాటరీ తో కూడా ప్యాక్ చేయబడింది. ఇక దీని పూర్తి స్పెసిఫికేషన్లను వివరంగా చూద్దాం.

 

స్క్రీన్ రిజల్యూషన్‌

స్క్రీన్ రిజల్యూషన్‌

లెనోవో Tab P11 5G భారీ 11-అంగుళాల IPS LCDని 2K (2000 x 1200) స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 400నిట్‌ల గరిష్ట ప్రకాశంతో మరియు NTSC కలర్ గామట్ యొక్క 70 శాతం కవరేజీని కలిగి ఉంది. ఈ టాబ్లెట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8nm ఫాబ్రికేషన్ ప్రాసెస్‌పై నిర్మించబడింది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 8GB LPDDR4 RAM మరియు 256GB వరకు నిల్వతో జత చేయబడింది. ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా ఆప్టిక్స్ వివరాలు

కెమెరా ఆప్టిక్స్ వివరాలు

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే,  Lenovo Tab P11 5G వెనక వైపు 13MP సింగిల్ రియర్ కెమెరా సెన్సార్‌తో అమర్చబడింది. మెరుగైన బయోమెట్రిక్‌ల కోసం ToF సెన్సార్‌తో పాటు ముందు భాగంలో ఉన్న 8MP సెన్సార్ ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు.ఈ టాబ్లెట్ యొక్క కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్లు గమనిస్తే, కంటి రక్షణ కోసం TUV సర్టిఫికేషన్, క్వాడ్ JBL స్పీకర్లు, డాల్బీ అట్మోస్, IP52 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్, 5G SA/NSA, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మరియు USB టైప్-C 3.1 (Gen 2) పోర్ట్ వంటివి ఉన్నాయి.

బ్యాటరీ
 

బ్యాటరీ

ఇంకా, ఈ లెనోవో Tab P11 5G లో 7700mAh బ్యాటరీతో 20W QC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ ఒక్క ఛార్జ్‌పై 12 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని Lenovo పేర్కొంది. కంపెనీ ఆప్షనల్ కీబోర్డ్ ప్యాక్ మరియు లెనోవా ప్రెసిషన్ పెన్ 2ని ఈ టాబ్లెట్‌తో అందిస్తోంది.

Lenovo Tab P11 5G: ధర మరియు సేల్ వివరాలు

Lenovo Tab P11 5G: ధర మరియు సేల్ వివరాలు

లెనోవో Tab P11 5G టాబ్లెట్ యొక్క 6GB+128GB వేరియంట్‌కి ప్రారంభ ధర ₹29,999. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ 8GB+256GB వేరియంట్ ధర ₹34,999 గా ఉంది. అమెజాన్ మరియు లెనోవా వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది.

Lenovo కొత్త Mini LED మానిటర్‌లు

Lenovo కొత్త Mini LED మానిటర్‌లు

ఇటీవలే, Lenovo రెండు కొత్త Mini LED మానిటర్‌లను లాంచ్ చేసింది. థింక్‌విజన్ P27pz-30 మరియు థింక్‌విజన్ P32pz-30గా గుర్తించబడిన ఈ మానిటర్‌లు స్క్రీన్‌పై వస్తువుల చుట్టూ కనిపించే బ్లర్రింగ్ హాలో ఎఫెక్ట్‌ను తగ్గించడంలో సహాయపడటానికి 1,152 డిమ్మింగ్ జోన్‌లను అందజేస్తాయని చెప్పబడింది. ThinkVision P27pz-30 మరియు P32pz-30 LED మానిటర్లు వరుసగా 27-అంగుళాల మరియు 31.5-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ మినీ LED మానిటర్‌లు పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ మెటీరియల్‌లను ఉపయోగించి తయారు చేయబడ్డాయి.

ఈ మానిటర్లు

ఈ మానిటర్లు

ఈ మానిటర్లు USB టైప్-C లేదా థండర్‌బోల్ట్ ఉపకరణాలతో కనెక్ట్ చేయగలవు.  ఒక USB4 కేబుల్ ద్వారా గరిష్టంగా 40Gbps డేటా మరియు వీడియో బదిలీని  అందిస్తారు. ఇంకా ఇవి, డైసీ చైన్ ద్వారా రెండు UHD మానిటర్‌లకు కూడా మద్దతు ఇవ్వగలవు . ముఖ్యంగా, ఈ మానిటర్లు స్మార్ట్‌ఫోన్‌లకు 15W మరియు ఇతర పరికరాలకు 140W వరకు శక్తిని అందిస్తాయి. 

Best Mobiles in India

Read more about:
English summary
Lenovo Tab P11 5G With 11 Inch Display And Snapdragon 750 Soc Processor Launched In India.Full Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X