మిడ్‌రేంజ్ ధరలో రిమోట్ అవసరం లేని టీవీ, ఇంటర్నెట్ లేకుండా..

మిడ్‌రేంజ్ ధరలో రిమోట్ అవసరం లేని టీవీ, ఇంటర్నెట్ లేకుండా..

|

సాధారణంగా టీవీ పనిచేయాలంటే రిమోట్‌ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్‌ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ భారత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది.చానెల్, పాటలు, వీడియోలు, గేమ్స్, ఫొటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం.

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి 30వేల ఉద్యోగాలుఫ్లిప్‌కార్ట్‌ నుంచి 30వేల ఉద్యోగాలు

32-77 అంగుళాల సైజులో..

32-77 అంగుళాల సైజులో..

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ 32-77 అంగుళాల సైజులో మొత్తం 25 మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.30 వేలతో ప్రారంభమై రూ.30 లక్షల వరకు ఉన్నాయి.

2017లో ఒక కోటి ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీలు ..

2017లో ఒక కోటి ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీలు ..

దేశవ్యాప్తంగా 2017లో ఒక కోటి ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.

కంపెనీకి 25 శాతం వాటా

కంపెనీకి 25 శాతం వాటా

పరిశ్రమలో తమ కంపెనీకి 25 శాతం వాటా ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ యూంచుల్‌ పార్క్‌ ఈ సందర్భంగా తెలిపారు.

అల్ట్రా హెచ్‌డీ టీవీల వాటా..
 

అల్ట్రా హెచ్‌డీ టీవీల వాటా..

గతేడాది పండుగల సీజన్లో జరిగిన కంపెనీ అమ్మకాల్లో అల్ట్రా హెచ్‌డీ టీవీల వాటా 14 శాతం. ఈ సీజన్లో ఇది 40 శాతానికి చేరుకుంటుందని ధీమాగా చెప్పారు.

చిన్న టీవీల స్థానంలో..

చిన్న టీవీల స్థానంలో..

కస్టమర్లు తమ చిన్న టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్లతో రీప్లేస్‌ చేస్తుండడం అధికంగా జరుగుతోందని వెల్లడించారు.

Best Mobiles in India

English summary
LG brings Artificial Intelligence to TVs in India: Everything you need to know more news Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X