సామ్‌సంగ్ నుంచి మరో సర్‌ప్రైజ్

|

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీన ఈ ఫ్లాగ్‌ఫిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా విప్లవాత్మక వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కూడా సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోందట.

 

మీ పీఎఫ్ బాలన్స్ ను స్మార్ట్‌ఫోన్లో చెక్ చేసుకోవడం ఎలా...?మీ పీఎఫ్ బాలన్స్ ను స్మార్ట్‌ఫోన్లో చెక్ చేసుకోవడం ఎలా...?

సామ్‌సంగ్ నుంచి మరో సర్‌ప్రైజ్

యాపిల్ ఎయిర్ పోడ్స్‌కు పోటీగా రాబోతోన్న వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను గెలాక్సీ బడ్స్ పేరుతో అందుబాటులో ఉంచుతారని ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ అంటున్నారు. ఈయన ద్వారా లీకైన ఓ ప్రొఫెషనల్ ఇమేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వీటి ధర ఇండియన్ మార్కెట్లో రూ.12100గా ఉండొచ్చని తెలుస్తోంది. లీక్ చేసిన ఫోటోలో గెలాక్సీ బడ్స్, ఓ ఫోన్ పై ప్లేస్ చేసి ఉన్నాయి. ఈ ఫోన్ గెలాక్సీ ఎస్10 ప్లస్ అయి ఉండొచ్చని క్వాండ్ట్ అభిప్రాయపడుతున్నాడు. అదేగనుక నిజమైన గెలాక్సీ ఎస్10 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ తో పాటు గెలాక్సీ బడ్స్‌ను ఛార్జ్ చేరయగలుగుతుంది. ఇటువంటి టెక్నాలజీ హువావే మేట్ 20 ప్రోలో ఇప్పటికే మనం చూశాం.

గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్‌లో

గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్‌లో

గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్‌లో రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఎక్విప్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. పవర్ షేర్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20న లాంచ్ కాబోబోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 21 నుంచి ప్రీఆర్డర్స్ పై విక్రయించే అవకాశముంది. గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించి 12జీబి ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా సామ్‌సంగ్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సామ్‌సంగ్ భవిష్యత్ ఆవిష్కరణల్లో ఒకటైన గెలాక్సీ ఎక్స్

సామ్‌సంగ్ భవిష్యత్ ఆవిష్కరణల్లో ఒకటైన గెలాక్సీ ఎక్స్

సామ్‌సంగ్ భవిష్యత్ ఆవిష్కరణల్లో ఒకటైన గెలాక్సీ ఎక్స్ కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతోంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి ఓ స్పెషల్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను సామ్‌సంగ్ అభివృద్థి చేయిస్తోందట. ఇందుకుగాను గూగుల్‌తో కలిసి సామ్‌సంగ్ పనిచేస్తోంది. ఈ సంస్థ రివీల్ చేసిన మరికొన్ని వివరాల ప్రకారం సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ 4 అంగుళాల స్ర్కీ‌న్‌తో రాబోతోంది. 200 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ప్రోటోటైప్ డివైస్‌లో బెండింగ్ మెకనిజం కారణంగా ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉండదట.

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగోతోన్న నేపథ్యంలో
 

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగోతోన్న నేపథ్యంలో

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగోతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే, ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు రెండు రోజుల ముందు లాంచ్ చేయబోతున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హువావే సీఈఓ రిచర్డ్ యు, ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చిన్న చిన్న స్ర్కీన్‌లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్‌ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ స్ర్కీన్‌ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్‌టాప్‌లతో సమానంగా పనచేయగలుగుతాయట.

Best Mobiles in India

English summary
Samsung to launch wireless earbuds along with Galaxy S10 smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X