స్మార్ట్‌ఫోన్‌లతోనే సగం జీవితాలు గడిచిపోతాయేమో!

|

ప్రపంచాన్ని శాసిస్తోన్న శక్తివంతమైన వ్యవస్థల్లో టెక్నాలజీ కూడా ఒకటి. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో టెక్నాలజీతో సంబంధంలేని జీవితాన్ని ఊహించుకోవటం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు టెక్నాలజీతో మమేకమవుతోన్న పరిస్థితులను ప్రస్తుతం మనం చూస్తున్నాం.

 
స్మార్ట్‌ఫోన్‌లతోనే సగం జీవితాలు గడిచిపోతాయేమో!

టెక్నాలజీ పై ఆధారపడతోన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక్కడి ప్రజల రోజువారీ జీవితాల్లో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్, యాప్స్ అనేవి ఓ భాగంగా మారిపోయాయి. టెక్నాలజీతో వీరు ఇంటరాక్ట్ అవుతోన్న తీరు భవిష్యత్ టెక్నాలజీ కాన్సెప్ట్స్‌కు బలమైన బాటను వేస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా భారతీయులతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్న పలు ముఖ్యమైన గాడ్జెట్స్ అలానే యాప్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొబైల్ ఫోన్‌ వాడని మనుషులు ఉన్నారా..?

మొబైల్ ఫోన్‌ వాడని మనుషులు ఉన్నారా..?

మొబైల్ ఫోన్‌లతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటోన్న భారతీయులు తమ జీవితాలను మరింత సుఖమయం చేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత భారతీయుల జీవనశైలితో పాటు వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ డివైస్ ద్వారా కమ్యూనికేషన్ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాలను కూడా తీర్చుకుంటూ ప్రపంచంతో పోటీపడే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ ఫోన్‌ను అత్యంత ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

నేటి ఉరుకుల పరుగుల కమ్యూనికేషన్ ప్రపంచంలో ఆన్‌లైన్ బంధాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సోషల్ నెట్‌వర్కింగ్‌కు భానిసలుగా మారుతోన్న చాలా మంది నెటిజనులు బాహ్య ప్రపంచంలో కంటే వర్చువల్ ప్రపంచంలో ఎక్కువుగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటువంటి వారికి ఫేస్‌బుక్ ఓ ఆన్‌లైన్ అడ్డాగా మారిపోయింది. ఈ యాప్ ద్వారా ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న

వివిధ అంశాలకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో సోషల్ మీడియా వినియోగం పీక్స్‌కు చేరుకోవటంతో వ్యాపార సంస్థలు సైతం తమ కస్టమర్‌లకు ఫేస్‌బుక్ ద్వారానే సేవలను అందిస్తున్నాయి.

ల్యాప్‌టాప్
 

ల్యాప్‌టాప్

భారతీయులు అత్యధికంగా వినియోగించుకుంటోన్న గాడ్జెట్‌లలో ల్యాప్‌టాప్ కూడా ఒకటి. డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు కాంపాక్ట్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌టాప్, పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తోంది. డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా భారీ కాన్ఫిగరేషన్‌లతో లభ్యమవుతోన్న ల్యాప్‌టాప్‌లను ఎడ్యుకేషన్, వర్క్, పర్సనల్ యూజ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అవసరాలకు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. విద్యార్థుల దగర్గ నుంచి బిజినెస్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు ఈ గాడ్జెట్ పై ఆసక్తి చూపుతున్నారు.

పవర్ బ్యాంక్

పవర్ బ్యాంక్

స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాటరీ‌లైఫ్ అనేది ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ఇన్‌స్టెంట్ బ్యాకప్‌ను అందించే పవర్ బ్యాంక్స్‌కు భారత్‌లో భారీ డిమాండ్ నెలకుంది. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో చేతిలోని ఫోన్ ఒక్క నిమిషం ఆగిందంటే చాలు ఒక్క పని కూడా ముందుకు సాగదు. చార్జింగ్ సమస్యలతో భాదపడుతోన్న స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణమే ఛార్జ్‌ను అందించటంలో పవర్ బ్యాంక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్, 2017 ముంచేసింది !కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్, 2017 ముంచేసింది !

షేర్‌ఇట్

షేర్‌ఇట్

షేర్‌ఇట్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్‌లలో బ్లుటూత్ వినియోగం దాదాపుగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. షేర్‌ఇట్ యాప్‌ను కోట్లాది మంది భారతీయులు ఉపయోగించుకుంటున్నారు. మొబైల్ ఫైల్ షేరింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన Shareit దాదాపుగా అన్ని ఫైల్ షేరింగ్ యాప్‌లను పక్కకు నెట్టేసింది.

వాట్సాప్

వాట్సాప్

స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సాప్, ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఇందుకు కారణం ఈ యాప్ అందిస్తోన్న వేగవంతమైన సర్వీసులే. ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌తో ప్రారంభమైన వాట్సాప్ సర్వీస్ అంచలంచెలుగా వీడియో కాలింగ్, స్టోరీస్ వంటి విభాగాలకు విస్తరించింది. ఫోటో మొదలుకుని మ్యూజిక్ ఫైల్ వరకు ఏదైనా వాట్సాప్ ద్వారా క్షణాలో షేర్ చేసుకునే వీలుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్

ప్రొఫెషనల్ ఫోటో షేరింగ్ యాప్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఇన్‌స్టా‌గ్రామ్‌కు ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ పాపులారిటీ పెరుగుతోంది. ఫేస్‌బుక్ నేతృత్వంలో ముందుకు సాగుతోన్న ఈ యాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన అనుభూతులను చేరువచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోన్న అత్యుత్తమ ఫీచర్లలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఒకటి.

హెడ్‌ఫోన్స్

హెడ్‌ఫోన్స్

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల తరువాత అంతలా డిమాండ్ ఉన్న గాడ్జెట్‌లలో హెడ్‌ఫోన్స్ ఒకటి.

హెడ్‌ఫోన్‌ల వినియోగం భారతీయుల రోజువారి జీవనశైలిలో ఓ భాగంగా మారిపోయింది. మ్యూజిక్‌ను ఆస్వాదించటం, రైడింగ్ సమయంలో కాల్స్ మాట్లాడటం వంటి యాక్టివిటీస్‌ను హెడ్‌ఫోన్స్ ద్వారా ఎక్కువగా నిర్వహించుకుంటున్నారు.

 గూగుల్ మ్యాప్స్

గూగుల్ మ్యాప్స్

భారతీయులు అత్యధికంగా వినియోగించుకుంటోన్న యాప్‌లలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఒకటి. ఈ నేపథ్యంలో తక్కువ ర్యామ్ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ మ్యాప్స్ గో యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో సందడి చేస్తుంది.

ఈ లైటర్ వర్షన్ యాప్‌ 1జీబి అంతకన్నా తక్కుమ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేయగలదు. గూగుల్ మ్యాప్స్ తరహాలోనే లొకేషన్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, డైరెక్షన్స్, ప్లేస్ సెర్చ్, ఫోన్ నెంబర్స్ సెర్చ్, అడ్రెస్ సెర్చ్ వంటి వంటి ఫీచర్లు గూగల్ మ్యాప్స్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్

ఇంటర్నెట్ వినియోగం దేశవ్యాప్తంగా మరింత విస్తరించిన నేపథ్యంలో ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లకు భారత్‌లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డౌన్‌లోడింగ్‌కు బదులుగా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. దీంతో ఇటువంటి యాప్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Technology is on the rise and booming rapidly than we thought it would.oday, in this article, we have listed out 10 apps and gadgets that you can't do without in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X