ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

Written By:

దేశంలో ఆధార్ కార్డులను కలిగి ఉన్న వారి సంఖ్య వంద కోట్లు దాటినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వంద కోట్ల మంది భారతీయుల డిజిటల్ ఐడెంటిటీ ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ప్రతి రోజు దాదాపు ఏడు లక్షల మంది కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

ఆధార్ గుర్తింపు అనేది 12 అంకెల గల వ్యక్తిగత సంఖ్య. భారత ప్రభుత్వం తరపున దీనిని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తుంది. ప్రతి ఆధార్‌ సంఖ్య ప్రతి వ్యక్తికి విశిష్టమైనది, ఆ వ్యక్తి జీవిత కాలానికి విలువైనది. బ్యాంకింగ్‌, మొబైల్‌ ఫోన్ కనెక్షన్‌లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలను పొందేందుకు ఆధార్ మీకు సహకరిస్తుంది. ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..

Read More : యాపిల్ రూ.10,000 ఫోన్‌ను రూ.40,000కు అమ్ముతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే 10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందవచ్చు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

బ్యాంక్ అకౌంట్‌ను సులువుగా ఓపెన్ చేయవచ్చు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

పదవీవిరమణ చేసి, పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులు త్రాము బ్రతికే ఉన్నామని నిరూపించుకునేందుకు ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ నిమిత్తం ప్రభుత్వ అధికారుల ముందు హాజరుకావల్సిన అవసరం లేకుండా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా తాము జీవించే ఉన్నామని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ ను పొందవచ్చు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా సులువు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

తమ ఆధార్ నెంబర్‌ను రిజిస్లర్ చుసుకోవటం ద్వారా పెన్షనర్లు నెలవారీ ఫించన్ ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

ఆధార్ నెంబర్‌ను రిజిస్లర్ చుసుకోవటం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డబ్బు సలువుగా మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ప్రభుత్వం అందిస్తోన్న డిజిటల్ లాకర్ సిస్టం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ లాకర్ సిస్టంలో విలువైన డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ఎల్పిజి సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

మీ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడీకి లింక్ చేయబడుతుంది.

ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో జన్ ధన్ యోజనా పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things You Didn't Know The Aadhaar Card Can Help You. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot