పకడో.. పకడో

|

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను సూచనల రూపంలో మీకందిస్తున్నాం.

ఖచ్చితమైన లోకేషన్‌తో మీ ఫోన్ ఎక్కడుందో తెలిపే ‘జీపీఎస్ చిప్'

ఆధునిక సెక్యూరిటీ ఫీచర్‌లలో ఒకటైన ట్రాకింగ్ వ్యవస్థను సెల్‌ఫోన్ కలిగి ఉండటం ద్వారా చోరి లేదా జారవిడిచిన సమయాల్లో సమయంలో సదురు ఫోన్ జాడను కనగొనవచ్చు. ఇందకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్) సాంకేతికత ఎంతోగానో తోడ్పడుతుంది. అంతేకాదు, ప్రయాణ సమయంలో మనమున్న ప్రాంతాన్ని ఇదే జీపీఎస్ వ్యవస్థసాయంతో మన కుటుంబ సభ్యులు కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు.

పకడో.. పకడో

పకడో.. పకడో

వివరాలు భద్రపరుచుకోండి (Keep Details):

మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు:

- ఫోన్ నెంబరు
- మోడల్ నెంబరు
- రంగు ఇతర గుర్తుల సమాచారం,
- పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్,
- ఐఎమ్ఈఐ నెంబరు.

పకడో.. పకడో

పకడో.. పకడో

సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి (Add a Security Mark):

అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

పకడో.. పకడో
 

పకడో.. పకడో

సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone):

సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు.

పకడో.. పకడో

పకడో.. పకడో

సదరు నెట్‌వర్క్ ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేయించండి (Register your phone with your network operator):

మీ ఫోన్ అపహరణకు గురైందని నిర్థారించకున్న వెంటనే మీరు వినియోగిస్తున్న నెట్‌వర్క్ ఆపరేటర్‌కు రిపోర్ట్ చేయండి. మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ ఆధారంగా వారు మీ ఫోన్ లోని వివరాలను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

పకడో.. పకడో

పకడో.. పకడో

మీ ఫోన్ నంబర్ డిసేబుల్ చేయించటం మంచిది (Have your phone number disabled):

మీ ఫోన్ అపహరణకు గురైందని నిర్థారించకున్న వెంటనే మీ ఫోన్ నెంబర్‌ను డిసేబుల్ చేయమంటూ నెట్‌వర్క్ ఆపరేటర్‌కు తెలపవచ్చు. ఇందుకు ఏ విధమైన ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో పైన పేర్కొన్న విధంగా ఫోన్ వివరాలు రాత పూర్వకంగా మీ వద్ద ఉండాలి.

పకడో.. పకడో

పకడో.. పకడో

దర్యాప్తునకు అభ్యర్థించండి (Request an immediate, formal investigation from your carrier):

మీ హ్యాండ్‌సెట్ అపహరణకు గురైన వెంటనే మీరు వినియోగిస్తున్న నెట్‌‌వర్క్ ఆపరేటర్‌కు వివరాలను తెలియజేసి దర్యాప్తుకు అభ్యర్థించండి.

పకడో.. పకడో

పకడో.. పకడో

పోలీసుకు ఫిర్యాదు చేయండి (File a police report):

ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది.

పకడో.. పకడో

పకడో.. పకడో

మీ ఫోన్ డిస్‌ప్లే పై నిమ్మ ఆకుపచ్చ రంగు జెల్‌ను వేయండి (Make a lime-green color gel for your phone's display):

మీ ఫోన్ డిస్‌ప్లే పై నిమ్మ ఆకుపచ్చ రంగు జెల్‌ను వేయండి. దింతో మీ ఫోన్ పాతదిలా కనిపిస్తుంది. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ పై ఎవరి దృష్టిపడదు.

పకడో.. పకడో

పకడో.. పకడో

యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు (Install anti phone theft software):

మీ ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు. వీటి సాయంతో మీ ఫోన్ ఎక్కడున్నది పసిగట్టవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X