ఖచ్చితమైన లోకేషన్‌తో మీ ఫోన్ ఎక్కడుందో తెలిపే ‘జీపీఎస్ చిప్’

Posted By:

ఆధునిక సెక్యూరిటీ ఫీచర్‌లలో ఒకటైన ట్రాకింగ్ వ్యవస్థను సెల్‌ఫోన్ కలిగి ఉండటం ద్వారా చోరి లేదా జారవిడిచిన సమయాల్లో సమయంలో సదురు ఫోన్ జాడను కనగొనవచ్చు. ఇందకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్) సాంకేతికత ఎంతోగానో తోడ్పడుతుంది. అంతేకాదు, ప్రయాణ సమయంలో మనమున్న ప్రాంతాన్ని ఇదే జీపీఎస్ వ్యవస్థసాయంతో మన కుటుంబ సభ్యులు కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఆధునిక వర్షన్ ఫోన్‌లు జీపీఎస్ చిప్‌ను కలిగి ఉంటున్నాయి.
తమ సెల్‌ఫోన్‌లో జీపీఎస్ వ్యవస్థను పొందాలనుకునే వారు ముందుగా తెలుసుకోవల్సిన అంశాలు. జీపీఎస్ చిప్‌ను సపోర్ట్ చేసే విధంగా మీ మొబైల్ ఫోన్ ఉండాలి. మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ జీపీఎఎస్ ఎనేబుల్ అయి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన కంప్యూటర్ తప్పనిసరి.

ప్రముఖ బ్రాండ్‌లు జీపీఎస్ చిప్‌లతో కూడిన సెల్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయ్:

బ్లాక్‌బెర్రీ, మోటరోలా, విండోస్ మొబైల్, నోకియా, సామ్‌సంగ్, తదితర ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు జీపీఎస్ చిప్‌లతో హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మీ ఫోన్ పాతదైన పక్షంలో దగ్గరలోని మొబైల్ స్టోర్‌లో జీపీఎస్ చిప్‌ను కొనుగోలు చేసి మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి.

ఖచ్చితమైన లోకేషన్‌తో మీ ఫోన్ ఎక్కడుందో తెలిపే ‘జీపీఎస్ చిప్’

మీ నెట్‌వర్క్ జీపీఎస్‌ను సపోర్ట్ చేస్తుందా..?

తమ ఫోన్‌లో జీపీఎస్ టెక్నాలజీని పొందాలనుకుంటున్న వారు ముందుగా తాము వినియోగిస్తున్న మొబైల్ నెట్‌వర్క్ జీపీఎస్ వ్యవస్థను సపోర్ట్ చేస్తుందా లేదా అన్న అంశం పై ఓ ప్రాధిమిక నిర్థారణకు రావల్సి ఉంటుంది. ఒకే వేళ మీరు వాడే మొబైల్ నెట్‌వర్క్ జీపీఎస్‌ను సపోర్ట్ చేయని పక్షంలో కొత్త నెట్‌వర్క్‌కు మారాల్సి ఉంటుంది.

లొకేషన్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోండి:

మీ ఫోన్ ‘జీపీఎస్ లోకేషన్ ఫైండర్'కు అనుకూలమైనట్లయితే. లొకేషన్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకుని సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోండి. ఆ తురవాతి చర్యగా కంప్యూటర్-ఫోన్ కేబుల్ సాయంతో ఫోన్‌ను పీసీకి అనుసంధానించి కంప్యూటర్‌లోని జీపీఎస్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను నిబంధనలను అనసరిస్తూ మీ ఫోన్‌లోకి లోడ్ చేసుకోండి.

చెక్ చేసుకోండి:

పైన పేర్కొన్న సూచనలు విజయవంతంగా అమలైనట్లయితే మీ ఫోన్‌లోని జీపీఎస్ ట్రాకింగ్ టెక్నాలజీ ఏ మేరకు స్పందిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot