మీ గూగుల్ బ్రౌజరే.. మీ అలారం..

Posted By: M KRISHNA ADITHYA

ఊహకు అందని ఫీచర్లతో నిత్యం బ్రౌజర్లకు కొత్త అనుభూతిని ఇస్తున్న గూగుల్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తో ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ అలారం పెట్టుకోవాలంటే ఫోన్స్, లాప్ టాప్, డెస్క్ టాప్ లలో స్పెషల్ అప్లికేషన్స్ ఉండేవి వాటి ద్వారా అలారం, స్టాప్ వాచ్, కౌంట్ డౌన్ లాంటివి ఏర్పాటు చేసేవాళ్లం.

మీ గూగుల్ బ్రౌజరే.. మీ అలారం..

ఇప్పుడు అదే పని ఎలాంటి యాప్ లేకుండా మీ సెర్చింజన్ బ్రౌజర్ హోం పేజ్ నే టైమర్ గా మార్చేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్ తో ముందుకు వచ్చేసింది. దీని కోసం ప్లేస్టోర్ లో మీరేమి యాప్ వేసుకోవక్కర్లేదు. మరేం చేయాలో చూద్దాం..

మరేం సింపుల్ గా మీ గూగుల్ బ్రౌజర్ సెర్చ్ బార్ లోకి వెళ్లి మీకు కావాల్సిన టైమ్ ను సెట్ చేసుకోవచ్చు.

మీ గూగుల్ బ్రౌజరే.. మీ అలారం..

టైమర్ సెట్ చేసుకోవడం..

మీరు ఏదైన ముఖ్యమైన పనిలో ఉన్నా, ఎక్సర్ సైజ్ చేస్తున్నా మరే ఇతర వర్క్ లో ఉన్నా సరే మధ్య మధ్యలో టైం చూస్తూ చేయడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా మీరు ఏదైన గోల్ సెట్ చేసుకుని చేసే పనిలో కాలం విలువ చాలా ముఖ్యమైనది. ఇందుకోసం మీ ఫోన్ లోని యాప్ ల జోలికి వెళ్లక్కర్లేదు. సింపుల్ గా మీ సెర్చ్ బార్ లోకి వెళ్లి ఎంతసేపు టైమర్ ను సెట్ చేసుకుంటారో అంతే టైప్ చేస్తే చాలు ఆటో మేటిగ్గా టైమ్ సెట్ అయిపోతుంది. దీంతో మీరు స్టాప్ వాచ్, లేదా కౌంట్ డౌన్ సెట్ చేసుకొని అలారం పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

సాధారణంగా అలారం కోసం రకరకాల గాడ్గెట్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కోసారి వాటి ఉపయోగం చాలా వరకూ ఆయా గాడ్గెట్స్ పనితీరును బట్టి ఉంటుంది. ఖచ్చితంగా పనిచేస్తాయి అనే గ్యారంటీ లేని పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఏరోబిక్స్, వంట, గేమ్, ఇతర పని ఏదైన చేస్తున్న సమయంలో టైమర్ చాలా అవసరం. సమయాన్ని నష్ట పరచకుండా టైం మేనేజ్ మెంట్ ప్రకారం ముందుకు కదిలేందుకు ఈ ఆటోమేటిక్ టైమర్లు పనిచేస్తాయి. సమయపాలన చేసేందుకు చక్కటి మార్గం టైమర్ సెట్ చేసుకోవడం. ఇప్పటికే పలు యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి కన్నా గూగుల్ టైమర్ చాలా సులభమైనది, ప్రభావ వంతంగా పనిచేసే వీలుంది.

మీ గూగుల్ బ్రౌజరే.. మీ అలారం..

స్టాప్ వాచ్ సెట్ చేసుకోవడం ఎలా ?

ఇందులో పెద్దగా ఆలోచించేది ఏమి లేదు. జస్ట్ సెర్చ్ బార్ లోకి వెళ్లి స్టాప్ వాచ్ అని టైప్ చేస్తే చాలు.. వెంటనే టైమర్ ప్రత్యక్ష మవుతుంది. కిందనే ఉన్న స్టార్ట్ బటన్ ను క్లిక్ చేస్తే టైమర్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది. ఇంత సింపుల్ గా ఆపరేట్ చేసే వీలుంది. స్టాప్ వాచ్ కోసం ఇప్పటి వరకూ ప్రత్యేక గాడ్గెట్స్ వాడుతున్నాం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా గూగుల్ సేవలు చాలా ఉపయోగకరంగా మారాయి.

అంతే కాదు . ఈ స్టాప్ వాచ్ ను ఎక్కడైనా ఏ టైం లో అయినా సెట్ చేసుకోవచ్చు. స్టాప్ వాచ్ ద్వారా మీరు ఎంత సమయాన్ని ఆదా చేస్తున్నారు. లేనిది అంచనా వేయవచ్చు. సమయ పాలనకు స్టాప్ వాచ్ లు ఖచ్చతంగా అవసరం, ముఖ్యంగా పరుగు పందాల్లోనూ, ఇతర గేమ్స్ లో సైతం ఈ స్టాప్ వాచెస్ ను వినియోగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ పనితీరుతో వచ్చిన ఈ ఫీచర్ యూజర్స్ ను చాలా ఆకట్టుకోనుంది.

రూ.699కే జియో నుంచి మరో ఫోన్, ఈ సారి కొత్త కండీషన్లతో !

అంతే కాదు గూగుల్ కేవలం టైమర్ సేవలకే పరిమితం కాలేదు. కన్వర్షన్స్ ను కేవలం గూగుల్ సెర్చి బాక్స్ లో టైప్ చేయగానే చూపిస్తోంది. ఉదాహరణకు రూపీ, డాలర్ లైవ్ విలువలను గూగుల్ సెర్చి బాక్స్ లో టైప్ చేసి వెంటనే తెలుసుకునే వీలుంది. అంతే కాదు స్టాక్స్ ధరలను కూడా గూగుల్ సెర్చి బార్ లో కొట్టి వెంటనే లైవ్ వేల్యూస్ తెలుసుకునే వీలుంది.

ఇంత కాలం కేవలం ఫోటోలు సెర్చి చేసేందుకు, వీడియోలు వెతికేందుకు ఇతర వెబ్ సైట్లను వెతికి పెట్టేందుకు మాత్రమే ఉపయోగ పడుతున్న గూగుల్ ఇప్పుడు నిత్య జీవితంలో ఉపయోగ పడే చాలా ఫీచర్లను తయారు చేస్తోంది. అందులో భాగమే ఇప్పుడు మీరు చూస్తున్న గూగుల్ టైమర్. ఇది ఇంతటితో ఆగని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు గూగుల్ సెర్చింజన్ రోజుకో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టి సరికొత్త బ్రౌజింగ్ అనుభవాన్ని ఇస్తోంది. అంతే కాదు వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఈ స్టాప్ వాచ్, అలాగే కౌంట్ డౌన్ టైమర్లను సెట్ చేసుకునే వీలుంది. మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టైమర్ సెట్ చేయమని కమాండ్ ఇస్తే చాలు వెంటనే టైమ్ సెట్ అయ్యి అలారం లేదా స్టాప్ వాచ్ ప్రత్యక్షం అవుతుంది. మరి ఇంకేందుకు ఆలస్యం గూగుల్ ను ఫుల్లుగా వాడేద్దాం.

English summary
One of the several things Google can be used for is to set timers through its homepage itself. Be it for studies, exercise, working, or even cooking, using this feature, one can avoid several distractions that come with the phone and continue their work unabated.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot