మీ స్మార్ట్‌ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుందో లేదో తనిఖీ చేయడం ఎలా?

|

ఆగష్టు 15 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని మోదీ తన యొక్క ప్రసంగంలో '5G యుగం'లోకి ప్రవేశించడాన్ని హైలైట్ చేశారు. భారతదేశం 5G మొబైల్ సేవల ఆవిర్భావంలో ఉందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతి రంగంలో కూడా కొత్త సంస్కరణలతో ముందుకు సాగడానికి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. 5G రోల్‌అవుట్‌ ప్రారంభం కానున్నడంతో దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ 6 శాతం CAGR వద్ద పెరుగనున్నది. 2021లోని 300 మిలియన్ల నుండి 2026లో దాదాపు 400 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ చేరుతుందని అంచనా వేయబడింది.

 
How to Check If Your Smartphone Supports 5G Network Enabled

ఈ అధిక డిమాండ్ ప్రాథమికంగా ప్రారంభించిన తర్వాత సృష్టించబడుతుంది. 5G టెక్నాలజీ హై-స్పీడ్ గేమింగ్ మరియు రిమోట్ హెల్త్‌కేర్ వంటి విభిన్నమైన అప్లికేషన్‌ల కారణంగా అత్యంత వేగంగా స్వీకరించబడిన మొబైల్ టెక్నాలజీగా మారిందని నమ్ముతున్నారు. OnePlus, OPPO, realme, Samsung మరియు vivo వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు అధికంగా 5G టెక్నాలజీకి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు తమను తాము భవిష్యత్తులో రుజువు చేసుకోవాలనుకోవడానికి 5G విభాగంవైపు కొనసాగుతున్నారు. మీరు ఉపయోగిస్తున్న ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ 5Gకి మద్దతిస్తుందో లేదో తనిఖీ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుందో లేదో తనిఖీ చేసే విధానం

How to Check If Your Smartphone Supports 5G Network Enabled

** మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

** తరువాత "Wi-Fi మరియు నెట్‌వర్క్" ఎంపికపై క్లిక్ చేయండి.

** "SIM మరియు నెట్‌వర్క్" ఎంపికపై క్లిక్ చేయండి.

** చివరగా 'ప్రీఫర్డ్ నెట్‌వర్క్ టైప్' ఎంపిక క్రింద అన్ని టెక్నాలజీల జాబితాను చూడగలరు.

** ఆండ్రాయిడ్ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే అది 2G/3G/4G/5Gగా లిస్ట్ చేయబడుతుంది.

టెలికాం శాఖ (DoT) గత నెలలో భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలాన్ని పూర్తి చేసింది. ఇందులో భాగంగా జియో సంస్థ 24,740MHz 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయగా ఎయిర్టెల్ సంస్థ 19867.8MHz స్పెక్ట్రమ్‌ను మరియు వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ 3300MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇటీవల Jio, Airtel, Vi మరియు అదానీ డేటా నెట్‌వర్క్‌లు 5G వేలం కోసం ప్రారంభ చెల్లింపులో భాగంగా రూ.17,876 కోట్ల మొత్తాన్ని చెల్లించాయి. ఇప్పుడు చెల్లింపు చేసిన కొద్ది రోజులకే టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లను భారతదేశంలో 5G ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

How to Check If Your Smartphone Supports 5G Network Enabled

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు అదానీ డేటా నెట్‌వర్క్స్ నాలుగు కంపెనీలు తమ 5G స్పెక్ట్రమ్ వేలం బకాయిల మొదటి వాయిదాను DoTకి ఇప్పటికే చెల్లించాయి. రిలయన్స్ జియో రూ.7,864.78 కోట్లు చెల్లించగా, వొడాఫోన్ ఐడియా రూ.1,679.98 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్ రూ.18.94 కోట్లు చెల్లించాయి. మరోవైపు ఎయిర్‌టెల్ రూ.8312.4 కోట్ల మొత్తాన్ని నాలుగు వార్షిక వాయిదాలలో అడ్వాన్స్‌గా చెల్లించింది.

Best Mobiles in India

English summary
How to Check If Your Smartphone Supports 5G Network Enabled

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X