ఫ్లాష్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా, అయితే ఇలా తీసి పడేయండి

Written By:

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అందరికీ జీవితంలో ఓ భాగమైపోయింది. ప్రతి ఒక్కపనికి అది ఆధారంగా మారింది. ఇంటర్నట్ శరవేగంగా విస్తరిస్తున్న నేటి యుగంలో స్మార్ట్‌ఫోన్‌తోనే అన్ని పనులు చేసేస్తున్నారు కూడా.. అయితే దీంతో పాటు కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. కంపెనీ నుంచి ఫ్లాష్ మెసేజ్‌లు ఊరికే వస్తుంటాయి. వాటితో కొన్ని సార్లు ఎక్కడ లేని కోపం వస్తుంది. వాటిని తీసిపారేయాలనిపిస్తుంది కూడా..అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం ఓ సారి చెక్ చేయండి.

దూసుకొస్తున్న Jio పేమెంట్ బ్యాంక్‌ , SBIతో కలిసి ముందుకు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో యూజర్లు

జియో యూజర్లు దీన్ని ఆపేయాలంటే ఆప్సన్ లేదు. మొబైల్ లో ఉన్న మై జియో యాప్ ను డిలీట్ చేస్తే ఇవి ఆగిపోతాయి. అయితే డేటా , బ్యాలన్స్ వివరాలు దానిలోనే ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను మీరు జియో సైట్లోకెళ్లి కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఐడియా యూజర్లు

మీ ఐడియా నంబర్ నుంచి *121*46# డయల్ చేస్తే మీ రిక్వెస్ట్ ను అంగీకరిస్తున్నామని ఇకపై మీకు కంపెనీ నుంచి ఎలాంటి డేటా నోటిఫికేషన్లు రావని మెసేజ్ వస్తుంది. దీంతో పాటు ఐడియా పవర్ యాప్‌లో కెళ్లి అక్కడ మీరు ఐడియా ఫ్లాష్ ని సెలక్ట్ చేసుకుని దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. అయితే ఇది కొన్ని ఫోన్లకు మాత్రమే ఉంది.

వొడాఫోన్ యూజర్లు

వొడాఫోన్ టూల్ కిట్ లో కెళితే మీకు వొడాఫోన్ సర్వీసెస్ అనే ఆప్సన్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఫ్లాష్ ఆప్సన్ కనిపిస్తుంది. దీన్ని టాప్ చేస్తే ఫ్లాష్ సెట్టింగ్స్ ఆప్సన్ వస్తుంది. అది యాక్టివేట్ లో ఉంటే మీరు దాన్ని డీయాక్టివేట్ చేస్తే మీకు ఎటువంటి ఫ్లాష్ మెసేజ్‌లు రావు.

Airtel యూజర్లు

Airtel యూజర్లు లైవ్‌లో కాని, Airtel లైవ్ లో కాని ఈ ఆప్సన్ ఉంటుంది. అక్కడికెళ్లి మీరు దీన్ని స్టాప్ చేయవచ్చు. ఇంకొక ఆప్సన్ ఏంటంటే మీ Airtel నంబర్ నుంచి STOP NOW టని టైప్ చేసి 58234కి SMS చేస్తే చాలు. అవి ఆగిపోతాయి.

BSNL యూజర్లు

బిఎస్ఎన్ఎల్ యూజర్లు BSNL BUZZలో కెళ్లి ఈ ఫ్లాష్ మెసేజ్ లను డీయాక్టివేట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to disable flash messages on android mobiles Read more News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot