Airtel ఎక్స్‌ట్రీమ్ ఫైబ‌ర్ Invoices డౌన్‌లోడ్ చేయ‌డ‌మెలాగో తెలుసుకోండి!

|

Airtel కంపెనీ భార‌త దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వ‌ర్క్‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ కంపెనీ ఇటీవ‌లి కాలంలో Airtel Xstream Fiber పేరుతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో అడుగుపెట్టి విశేషంగా వినియోగ‌దారుల బేస్‌ను రాబ‌డుతోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్‌తో కంపెనీలు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ క‌ల్పించ‌డం కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబ‌ర్‌కు క‌లిసి వ‌చ్చింది.

airtel xstream fiber invoice

Airtel ఒక్క‌టే అని కాకుండా అన్ని బ్రాడ్‌బ్యాండ్‌ల‌కు డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ.. Airtel Xstream Fiber కు మాత్రం కొద్ది రోజుల్లోనే మంచి స్పంద‌న ల‌భించింది. అలా ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ ఉప‌యోగిస్తున్న వారిలో ఎక్కువ శాతం వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు స‌హా ఇత‌రులు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో వారికి కంపెనీల్లో బ్రాడ్‌బ్యాండ్ బిల్ క్ల‌యిమ్ చేసుకోవ‌డానికి ఇన్‌వాయిస్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అలాంటి వారి కోసం మేం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ బిల్స్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ ను స్టెప్ బై స్టెప్ రూపంలో ఇస్తున్నాం.. దీనిపై ఓ లుక్కేయండి.

Airtel Xstream Fiber స‌ర్వీసెస్ ఇన్‌వాయిస్ డౌన్‌లోడ్ ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ముందుగా కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ Airtel.in లోకి వెళ్లాలి.
* హోం పేజీ ఓపెన్ అయిన త‌ర్వాత పై భాగంలో కుడి వైపున యూజ‌ర్ లాగిన్ ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* యూజ‌ర్ లాగిన్ కోసం ఇప్పుడు ఓ లాగిన్‌ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ ఐడీలో యూజ‌ర్ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ టైప్ చేయాలి. ఆ త‌ర్వాత క్లిక్ టూ వ‌న్ టైం పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయ‌డం ద్వారా యూజ‌ర్ రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని అక్క‌డే ఇచ్చిన బాక్సులో ఎంట‌ర్ చేయ‌డం ద్వారా వెరిఫికేష‌న్ పూర్త‌వుతుంది.
* అనంత‌రం కింద లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే.. యూజ‌ర్లు త‌మ ఎయిర్‌టెల్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్‌లోకి లాగిన్ అవుతుంది.
* లాగిన అయిన త‌ర్వాత అందులో ఎడ‌మ‌వైపు పైభాగంలో ఎయిర్‌టెల్ సంబంధించి యూజ‌ర్ మొబైల్ నంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ అయిన అన్ని ఎయిర్‌టెల్ స‌ర్వీసుల‌కు సంబంధించిన ఓవ‌ర్‌వ్యూ క‌నిపిస్తుంది.
* ఆ ఓవ‌ర్ వ్యూ కింద Broadband సేవ‌లకు సంబంధించిన‌ ఆప్ష‌న్ క‌నిపిస్తాయి.
* Broadband సేవ‌ల‌ను ఎంచుకున్న త‌ర్వాత‌.. అందులో బిల్లింగ్‌కు సంబంధించిన ఆప్ష‌న్ ఉంటుంది.
* దాని మీద క్లిక్ చేయ‌డం ద్వారా మ‌న‌కు లాస్ట్ పేమెంట్ లిస్ట్ క‌నిపిస్తుంది. అక్క‌డే మ‌న‌కు ఏ నెల బిల్ కావాలో దానికి సంబంధించిన ఫైల్స్ క‌నిపిస్తాయి. ఆ ఫైల్స్ కుడి వైపున మ‌న‌కు ఫైల్ వ్యూ వివ‌రాలు, మ‌రియు ప్రింట్‌, డౌన్‌లోడ్ ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిని క్లిక్ చేయ‌డం ద్వారా ఇన్‌వాయిస్ లేదా బిల్ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

airtel xstream fiber invoice

Landline బిల్ డౌన్‌లోడ్ ప్ర‌క్రియ‌:
* ముందుగా కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ Airtel.in లోకి వెళ్లాలి.
* హోం పేజీ ఓపెన్ అయిన త‌ర్వాత పై భాగంలో కుడి వైపున యూజ‌ర్ లాగిన్ ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* యూజ‌ర్ లాగిన్ కోసం ఇప్పుడు ఓ లాగిన్‌ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ ఐడీలో యూజ‌ర్ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ టైప్ చేయాలి. ఆ త‌ర్వాత క్లిక్ టూ వ‌న్ టైం పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయ‌డం ద్వారా యూజ‌ర్ రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని అక్క‌డే ఇచ్చిన బాక్సులో ఎంట‌ర్ చేయ‌డం ద్వారా వెరిఫికేష‌న్ పూర్త‌వుతుంది.
* అనంత‌రం కింద లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే.. యూజ‌ర్లు త‌మ ఎయిర్‌టెల్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్‌లోకి లాగిన్ అవుతుంది.
* లాగిన అయిన త‌ర్వాత అందులో ఎడ‌మ‌వైపు పైభాగంలో ఎయిర్‌టెల్ సంబంధించి యూజ‌ర్ మొబైల్ నంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ అయిన అన్ని ఎయిర్‌టెల్ స‌ర్వీసుల‌కు సంబంధించిన ఓవ‌ర్‌వ్యూ క‌నిపిస్తుంది.
* ఆ ఓవ‌ర్ వ్యూ కింద ల్యాండ్‌లైన్‌ సేవ‌లకు సంబంధించిన‌ ఆప్ష‌న్ క‌నిపిస్తాయి.
* ల్యాండ్‌లైన్‌ సేవ‌ల‌ను ఎంచుకున్న త‌ర్వాత‌.. అందులో బిల్లింగ్‌కు సంబంధించిన ఆప్ష‌న్ ఉంటుంది.
* దాని మీద క్లిక్ చేయ‌డం ద్వారా మ‌న‌కు లాస్ట్ పేమెంట్ లిస్ట్ క‌నిపిస్తుంది. అక్క‌డే మ‌న‌కు ఏ నెల బిల్ కావాలో దానికి సంబంధించిన ఫైల్స్ క‌నిపిస్తాయి. ఆ ఫైల్స్ కుడి వైపున మ‌న‌కు ఫైల్ వ్యూ వివ‌రాలు, మ‌రియు ప్రింట్‌, డౌన్‌లోడ్ ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిని క్లిక్ చేయ‌డం ద్వారా ఇన్‌వాయిస్ లేదా బిల్ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

airtel xstream fiber invoice

ఇక‌పోతే, Airtel Xstream Fiber లో (ఎయిర్‌టెల్ బ్లాక్‌) త‌క్కువ ధ‌ర‌లో టీవీ ఛానెల్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తో వ‌స్తున్న బెస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:
Airtel Xstream Fiber (ఎయిర్‌టెల్ బ్లాక్‌) ఫైబర్ రూ.699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌:
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో రూ.699 ధరతో టీవీ ఛానెల్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని పొందుతారు. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలైవ్, ErosNow, లయన్స్‌గేట్ ప్లే, మనోరమమాక్స్, Hoichoi, Ultra, షెమరూ, EPICON, హంగామాక్స్, DivoTV, Klikk, Nammaflix, Dollywood మరియు Shorts TV వంటి 14 OTTలకు ప్రీమియం సింగిల్ లాగిన్ యాక్సెస్‌తో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ 14 OTT ప్లాట్‌ఫారమ్‌లు రూ.1099 మరియు రూ.1599 ధరల వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కూడా అందించబడుతున్నాయని గమనించండి. అదనంగా ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో పాటుగా 350 ఛానెల్‌ల టీవీ సర్వీసుకు కూడా ఉచిత యాక్సిస్ లభిస్తుంది. కానీ STB (సెట్-టాప్ బాక్స్) కోసం మీరు రూ. 2,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB ఉచిత డేటాను పొందుతారు.

Best Mobiles in India

English summary
How to download airtel xstream fiber invoice download

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X