NCERT యొక్క అన్ని తరగతుల ఇ-బుక్ లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ప్రభావితమైన రంగాలలో విద్యారంగం కూడా ఉన్నది. మార్చి 14 నుంచి దేశంలోని అన్ని రకాల విద్యాసంస్థలు పూర్తిగా మూసివేయడంతో విద్యార్థులకు చాలా రోజులు గ్యాప్ రావడంతో చదివినవి అన్ని కూడా మరచిపోయే అవకాశం ఉన్నాయి.

ఆన్ లైన్ క్లాసులు

కొన్ని విద్యాసంస్థలు తమ స్టూడెంట్స్ కోసం ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నప్పటికీ వారికి కావలసిన టెక్స్ట్ బుక్స్ మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. అనేక పాఠశాలలు చాలా రకాల వీడియో కాలింగ్ యాప్ లను ఉపయోగించి ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నప్పటికీ పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ వంటి అధ్యయన సామగ్రి లభ్యత ఇప్పటికీ తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు సమస్యగా మారింది.

NCERT

NCERT

ఇటువంటి వారి కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT) సంస్థ అన్ని తరగతుల విద్యార్థులకు వారి టెక్స్ట్ బుక్ లను అందివ్వడానికి డిజిటల్ కాపీని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇ-బుక్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ ఇ-బుక్ ను వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మొదటి తరగతి నుండి పన్నెండో తరగతి వరకు అన్ని రకాల పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పుస్తకాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో అని మీరు ఆలోచిస్తున్నట్లయితే కింద ఉన్న దశల వారీ సూచనలను అనుసరించండి.

NCERT అధికారిక వెబ్‌సైట్

NCERT అధికారిక వెబ్‌సైట్

ప్రస్తుత సమయంలో బయటకు వెళ్లకుండా మీ యొక్క పిల్లల కోసం మెరుగైన విద్యను అందించడానికి NCERT అధికారిక వెబ్‌సైట్ నుండి ఇ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి అన్ని కూడా తాజా సిలబస్ మరియు పాఠ్యాంశాల ప్రకారం అప్ డేట్ చేయబడి ఉన్నాయి.

NCERT పుస్తకాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

NCERT పుస్తకాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

*** మొదటగా మీరు "http://ncertbooks.ncert.gov.in' వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి.

*** ఇందులో లాగిన్ & రిజిస్టర్ విభాగం క్రింద ఉంచిన 'ఫ్రీ వ్యూ మరియు డౌన్‌లోడ్ ఈబుక్స్' బటన్ పై క్లిక్ చేయండి.


*** ఇది మిమ్మల్ని వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్ బుక్ పేజీకి మళ్ళిస్తుంది.

*** ఆ వెబ్‌సైట్‌లో క్లాస్, సబ్జెక్ట్, బుక్ టైటిల్ ఎంచుకుని 'గో' బటన్ పై క్లిక్ చేయండి.


*** పేజీ మొత్తంలో బుక్ ఎడమవైపున అధ్యాయ సూచికతో మరియు కుడి వైపున చాప్టర్ ఇండెక్స్ తో లోడ్ చేస్తుంది.

*** ప్రివ్యూను లోడ్ చేయడానికి చాప్టర్ లోని దేనినైనా క్లిక్ చేయండి.

*** మీరు కొంచెం క్రిందికి స్క్రోల్ చేసి చదవవచ్చు మరియు మొత్తం పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేయడానికి 'పూర్తి పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేయండి' లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

 

డౌన్‌లోడ్ చేయబడిన ఇ-పుస్తకాలను ఓపెన్ చేయడానికి మీ యొక్క కంప్యూటర్ లేదా లాప్ టాప్ లో అక్రోబాట్ రీడర్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వంటి ఏదైనా PDF రీడర్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. పుస్తకం డౌన్‌లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీ యొక్క పిల్లలకు అన్ని పాఠాలను చదివి వినిపించవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Download NCERT e-Text Books For All Classes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X