మీ వైఫైతో కనెక్ట్ అయి ఉన్న ఇతర డివైసుల వివరాలను తెలుసుకోవటం ఎలా..?

పర్సనల్ వై-ఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.

By GizBot Bureau
|

పర్సనల్ వై-ఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొన్నికొన్ని సందర్భాల్లో మన వై-ఫై నెట్‌వర్క్‌ను మనకు తెలియకుండానే ఇతరులు వాడేస్తుంటారు. దీంతో బ్యాండ్‌విడ్త్ డివైడ్ అయి నెట్‌వర్క్ స్పీడు పూర్తిగా తగ్గిపోతుంటుంది.

ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారో ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు..

ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారో ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు..

ఇటువంటి పరిస్థితిని తరచూ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఈ కూల్ చిట్కాను ఉపయోగించి మీ వైఫై కనెక్షన్‌కు మీరు కాకుండా ఇంకా ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారో ఫోన్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు..

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి Fing - Network Tools అనే యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత డివైస్‌లో లాంచ్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తరువాత ఆన్ స్క్రీన్ ఆప్షన్‌లను ఫాలో అవుతూ మీ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేయాలి. సాన్కింగ్‌లో అటువంటి వివరాలు ఏమైనా బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

 

 

మరొక పద్థతిలో భాగంగా...
 

మరొక పద్థతిలో భాగంగా...

మరొక పద్థతిలో భాగంగా Wifi Inspector అనే యాప్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ యాప్ సేవలను వినియోగించుకోవాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వై-ఫై ఇన్స్ పెక్టర్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత డివై‌స్‌లో లాంచ్ చేయాలి. యాప్ లాంచ్ అయిన వెంటనే మీరు కనెక్ట్ అయి ఉన్న నెట్‌వర్క్‌ను యాప్ స్కాన్ చేసేస్తుంది. ఆ తరువాత "Inspect Network" ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ వై-ఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేయబడతాయి. సాన్కింగ్‌లో అటువంటి వివరాలు ఏమైనా బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

 

 

ఐఫోన్‌ యూజర్లు..

ఐఫోన్‌ యూజర్లు..

ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే Fing - Network Tools for iOS అనే యాప్‌ను మీ ఐఓఎస్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత యాప్‌ను ఓపెన్ చేసి ఆన్‌స్క్రీన్ ఆప్షన్‌లను ఫాలో అవుతూ మీ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్న డివైసులను స్కాన్ చేసుకోవాలి. సాన్కింగ్‌లో మీ వై-ఫై నెట్‌వర్క్‌ను వేరేవారు వినియోగించుకుంటున్నట్లు బయటపడినట్లయితే, వెంటనే ఆయా డివైస్‌లకు సంబంధించిన మ్యాక్ అడ్రస్‌ను చెక్ చేసుకుని వాటిని మీ వై-ఫై రౌటర్‌లో బ్లాక్ చేసుకునే వీలుంటుంది.

 

 

 

Best Mobiles in India

English summary
How To Find Devices Connected to your Wifi using Smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X