COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

|

ఇండియాలో కరోనా యొక్క వ్యాప్తిని తగ్గించే ఉద్దేశంతో ఏప్రిల్ 28 నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాను పొందడం కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకా కోసం ప్రభుత్వ కో-విన్ పోర్టల్‌లో www.cowin.gov.in లేదా గత సంవత్సరం ప్రారంభించిన ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకోవడానికి సువర్ణ అవకాశం అందిస్తున్నది.

ఫేస్ 3 కోవిడ్ వ్యాక్సిన్

ఇప్పటి వరకు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే టీకా షాట్ తీసుకోవడానికి అనుమతించారు. మే 1 నుంచి మూడవ దశ ప్రారంభమవుతుందని మైగోఇండియా మరియు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తెలిపారు. ఫేస్ 3 కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 28 న కోవిన్ వెబ్‌సైట్ మరియు యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలో లభించే ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రారంభమవుతాయని ప్రకటించారు.

CoWIN పోర్టల్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ ను నమోదు చేసే విధానం

CoWIN పోర్టల్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ ను నమోదు చేసే విధానం

** మీరు కోవిన్ వెబ్‌సైట్ లేదా కోవిన్.గోవ్.ఇన్ సందర్శించి రిజిస్టర్ / సైన్ ఇన్ యువర్‌సెల్ఫ్ పై క్లిక్ చేయండి.

** మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి గెట్ OTP ఎంపికను ఎంచుకోండి.

** OTP ని టైప్ చేసి ఎంటర్ ఎంపిక మీద క్లిక్ చేయండి

** టీకా కోసం రిజిస్టర్ పేజీని చూడండి. ఇందులో ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం మరియు పుట్టిన సంవత్సరం సహా అన్ని వివరాలను నమోదు చేయండి.

** తరువాత రిజిస్టర్ పై క్లిక్ చేయండి.

** మీరు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసే ఎంపికను పొందుతారు.

** రిజిస్టర్ అయిన వ్యక్తి పేరు పక్కన షెడ్యూల్‌పై క్లిక్ చేయండి.

** పిన్‌కోడ్‌ను నమోదు చేసి సెర్చ్ బటన్‌ను నొక్కండి.
** తరువాత వెబ్‌సైట్ పిన్‌కోడ్‌లోని కేంద్రాలను చూపుతుంది. మీకు దగ్గరలోని కోడ్ ను ఎంచుకోండి.
** తేదీ మరియు సమయాన్ని ఎంచుకుని, కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఒక లాగిన్ ద్వారా నలుగురు సభ్యులను జోడించడానికి వెబ్‌సైట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

 

ఆరోగ్యా సేతు యాప్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ నమోదు చేసే విధానం

ఆరోగ్యా సేతు యాప్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ నమోదు చేసే విధానం

** అరోగ్య సేతు యాప్ ను ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లో లభించే కోవిన్ టాబ్‌పై క్లిక్ చేయండి.

** వ్యాక్సిన్ నమోదు ఎంపికను ఎంచుకోండి మరియు ఫోన్ నంబర్‌ను నమోదు చేసి ఆపై OTP కోసం ఎదురుచూడండి.

** OTP ధృవీకరించిన తరువాత మీరు టీకా నమోదు పేజీకి మళ్లించబడతారు.

** కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం ప్రాసెస్‌లో పేర్కొన్న అదే దశలను అనుసరించండి.

 

Best Mobiles in India

English summary
How to Register For COVID-19 Vaccine Through Online and Aarogya Setu app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X