Google Docs లో డిజిటల్ డాక్యుమెంట్లపై సంతకం చేయడం ఎలా?

|

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఎంతలా అంటే ప్రజలు ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించేలా మార్పులను తీసుకువచ్చింది. దీని కారణంగా ప్రపంచం మొత్తం డిజిటల్‌గా రూపాంతరం చెందుతూ చాలా మంది కేవలం ఇంటి వద్ద నుండి పని చేయాలనే ఆలోచనకు అలవాటు పడ్డారు. ప్రజలు తమ వ్యక్తిగత జీవితాన్ని డిజిటల్‌గా నిర్వహించడం నేర్చుకున్నప్పటికీ చాలా మంది ఆన్‌లైన్‌లో ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి ఇప్పటికీ కష్టపడుతున్నారు. సెర్చ్ దిగ్గజం గూగుల్ ఈ సమస్యకు సరళమైన పద్దతిలో పరిష్కారం కనిపెట్టింది. గూగుల్ డాక్స్ వినియోగదారుల కోసం డాక్యుమెంట్ సైన్ అని పిలువబడే యాడ్-ఆన్ ను కొత్తగా కంపెనీ జతచేసింది. ఇది వినియోగదారులకు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి మరియు డిజిటల్‌గా సంతకం చేయడానికి మరియు మరొక వ్యక్తులకు షేర్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.

How to Sign Digitally in Google Docs

Google డాక్స్ లో డిజిటల్‌గా సంతకం చేసే పద్ధతులు

*** Google డాక్స్ ఓపెన్ చేసి ఏదైనా డాక్యుమెంట్ లోకి వెళ్ళండి

*** కుడివైపు ఎగువ మూలలో గల మూడు నిలువు చుక్కలపై నొక్కండి మరియు అందులో యాడ్-ఆన్ ఎంపిక మీద నొక్కండి.

*** యాడ్-ఆన్‌లను పొందండి ఎంపిక మీద నొక్కండి. ఇది మిమ్మల్ని గూగుల్ ప్లే స్టోర్‌కు మళ్ళిస్తుంది. అక్కడ డాక్స్ మద్దతుతో ఉన్న అన్ని యాడ్-ఆన్‌లను మీకు చూపుతుంది.

*** ఇందులో DocuSign ఎంచుకోండి మరియు దాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

How to Sign Digitally in Google Docs

*** Google డాక్స్‌ను తిరిగి ఓపెన్ చేయండి. ఇందులో మీరు సంతకం చేయదలిచిన డాక్యుమెంట్ ను ఎంచుకోండి మరియు DocuSign యాడ్-ఆన్‌ను ఓపెన్ చేయండి.

*** DocuSign లో "సైన్ ఇన్" ఎంపికను ఎంచుకోండి.

*** DocuSign లోకి లాగిన్ అవ్వండి లేదా క్రొత్త అకౌంటును సృష్టించండి.

*** సంతకం చేసి డాక్యుమెంట్ ను సేవ్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Sign Digitally in Google Docs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X