WhatsAppలో ఎన్‌క్రిప్టెడ్ చాట్ బ్యాకప్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలా?

|

వాట్సాప్ గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. ఏదైనా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాట్సాప్ ద్వారానే చర్చించుకుంటూ ఉంటారు. కొన్ని సమయాలలో పర్సనల్ విషయాలు ( ఫోటోస్ & వీడియో) వంటివి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కోసం మారినప్పుడు చాట్ లను తిరిగి పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాట్సాప్ వినియోగదారులు చాట్ బ్యాకప్‌లను పొందినప్పుడు వారి యొక్క సంభాషణలోకి మరొకరు చొరబడకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. ఎన్‌క్రిప్టెడ్ చాట్ బ్యాకప్‌ అనే ఫీచర్ గత సంవత్సరం మొదటిసారి ప్రకటించబడింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్ సాయంతో వాట్సాప్ తన చాట్ బ్యాకప్‌లను మరింత బలపరుస్తుంది.

వాట్సాప్

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో చాట్ లను సురక్షితంగా ఉంచడానికి ఎన్‌క్రిప్టెడ్ టెక్నిక్ ని ఉపయోగిస్తుంది. మరోవైపు చాట్ బ్యాకప్ గూగుల్ డిస్క్‌లో లేదా ఆపిల్ ఐక్లౌడ్ లో స్టోర్ చేయబడుతుంది. అయితే ఈ చాట్ బ్యాకప్‌లు ఎటువంటి ఎన్‌క్రిప్షన్ టెక్నిక్ ద్వారా కూడా భద్రపరచబడవు. అందువల్ల హ్యాకర్లు మీ యొక్క డివైస్లను సులభంగా హ్యాక్ చేసి మీ యొక్క విషయాలను పొందే అవకాశం ఉంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ బ్యాకప్‌లలోని కంటెంట్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా ఎన్‌కోడ్ చేయడంతో మీరు సురక్షితంగా ఉండవచ్చు. ఈ కొత్త ఫీచర్ డిఫాల్ట్‌గా ప్రారంభించబడలేదు కావున వాట్సాప్ వినియోగదారులు తమ చాట్ బ్యాకప్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రపరచడానికి బిడ్‌లో దీనిని ఆన్ చేయవలసి ఉంటుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

WhatsAppలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్ బ్యాకప్‌ని ఆన్ చేసే విధానం

WhatsAppలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్ బ్యాకప్‌ని ఆన్ చేసే విధానం

స్టెప్ 1: వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో సెట్టింగ్‌ల ఎంపికని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: తరువాత చాట్స్ విభాగాన్ని ఎంచుకొని ఆపై 'చాట్ బ్యాకప్‌' ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 3: తరువాత 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు టర్న్ ఆన్ ఆప్షన్‌ మీద నొక్కండి. తరువాత పాస్‌వర్డ్ లేదా కీని సృష్టించడానికి ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను అనుసరించండి.

స్టెప్ 5: చివరగా క్రియేట్ ఆప్షన్‌ ఎంపిక మీద నొక్కండి. ఆపై మీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ను సిద్ధం చేయడానికి కొంత సమయం వేచి ఉండండి.

వాట్సాప్ వినియోగదారులు పాస్‌వర్డ్ లేదా కీని మరచిపోతే బ్యాకప్‌ను పొందలేరని గుర్తుంచుకోండి. అలాగే మీరు వాట్సాప్ యొక్క పాస్‌వర్డ్ లేదా కీని మర్చిపోతే దాన్ని రీసెట్ చేయడం కూడా సాధ్యం కాదు.

 

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని ఆఫ్ చేసే విధానం

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని ఆఫ్ చేసే విధానం

స్టెప్ 1: వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో సెట్టింగ్‌ల ఎంపికని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: తరువాత చాట్స్ విభాగాన్ని ఎంచుకొని ఆపై 'చాట్ బ్యాకప్‌' ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 3: తరువాత 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్' ఎంపికను ఎంచుకొని దానిపై నొక్కండి.

స్టెప్ 4: తర్వాత టర్న్ ఆఫ్ ఆప్షన్‌ని ఎంచుకోండి.

స్టెప్ 5: చాట్ బ్యాకప్ కోసం మీరు సెట్ చేసిన 64-బిట్ ఎన్‌క్రిప్షన్ కీని నమోదు చేయండి.

స్టెప్ 6: చివరగా మీరు టర్న్ ఆఫ్ ఆప్షన్‌ను ఎంచుకున్న తరువాత ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని ఆఫ్ చేసారని నిర్ధారించుకోండి.

 

Best Mobiles in India

English summary
How to Turn On or Off End-to-End Encrypted Chat Backups on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X