ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్ వాడటం ఎలా..?

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు 100 కోట్లకు పై యూజర్లు వినియోగించు కుంటున్నట్లు ఓ అంచనా. ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచిన అనేక ఫీచర్లు యాప్ వినియోగాన్ని మరింతగా రెట్టింపు చేస్తున్నాయి.

 
ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్ వాడటం ఎలా..?

డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగించుకుంటోన్న చాలా మంది యూజర్లకు తమ డివైస్‌లోని రెండు నెంబర్లకు వేరువేరు వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. అయితే వాట్సాప్ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన మొబైల్ డివైస్‌లో ఒక వాట్సాప్ అకౌంట్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను నిర్వహించుకునేందుకు సాధ్యమవుతుంది. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసకుందాం...

వాట్సప్‌లో డూప్లికేట్ కరెంట్ బిల్ పొందడం ఎలా ?వాట్సప్‌లో డూప్లికేట్ కరెంట్ బిల్ పొందడం ఎలా ?

వాట్సాప్‌ను క్లోనింగ్ చేయటం ద్వారా ..

వాట్సాప్‌ను క్లోనింగ్ చేయటం ద్వారా ..

వాట్సాప్‌ అప్లికేషన్‌ను క్లోనింగ్ చేయటం ద్వారా ఏకంగా రెండు వాట్సాప్ అకౌంట్లను వినియోగించుకునే వీలుంటుంది. క్లోన్ చేసిన వాట్సాప్ యాప్‌లో సెకండరీ నెంబర్ ద్వారా సైనప్ కావొచ్చు. ఈ ట్రిక్‌ను థర్డ్ పార్టీ యాప్ లేదా సిస్టం ఆధారిత క్లోనింగ్ ఆప్షన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. షావోమి, ఒప్పో, హానర్ వంటి చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు డెడికేటెడ్ క్లోన్ యాప్ ఆప్షన్స్‌తో వచ్చాయి. 'Dual Apps', 'Clone App', 'App Twin' పేర్లతో ఈ ఆప్షన్‌లను ఆయా బ్రాండ్‌లు తమ ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయి. డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లటం ద్వారా వీటిని యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

మీరు సామ్‌సంగ్ లేదా స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్నట్లయితే

మీరు సామ్‌సంగ్ లేదా స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్నట్లయితే

మీరు సామ్‌సంగ్ లేదా స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్నట్లయితే వాట్సాప్‌ను క్లోనింగ్ ఆప్షన్ అందుబాటులో ఉండదు. ఇటువంటి యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి Parallel Space or DualSpace వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా డ్యయల్ వాట్సాప్ అకౌంట్లను నిర్వహించుకునే వీలుంటుంది.

వాట్సాప్ ద్వారా నిత్యం
 

వాట్సాప్ ద్వారా నిత్యం

వాట్సాప్ ద్వారా నిత్యం లక్షలాది ఫోటోలు షేర్ కాబడుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సెండ్ చేయబడుతోన్న ఫోటోలు అవతలి వ్యక్తికి చేరుకునే సమయానికి కంప్రెషన్‌కు గురవుతున్నాయి. దీంతో ఇమేజ్ క్వాలిటీ దాదాపుగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఫుల్ రిసల్యూషన్‌తో కూడిన ఫోటోలను వాట్సాప్‌లో యూజర్లు షేర్ చేసుకోలేకపోతున్నారు.

ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే

ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే

ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అయి నాన్-కంప్రెసుడ్ ఫోటోలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోండి. మనలో చాలా మంది వాట్సాప్‌లో ఏదైనా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలనుకున్నపుడు ముందుగా ఆ ఫైల్‌ను ఫైల్ బ్రౌజర్ ద్వారా అటాచ్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్లే ఇమేజ్ క్వాలిటీ అనేది సగానికి తగ్గిపోతుంది.

ఇక పై అలా జరగకుండా ఉండాలంటే

ఇక పై అలా జరగకుండా ఉండాలంటే

ఇక పై అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా ఫోటోను పంపాలనుకన్నపుడు ముందుగా అటాచ్ లింక్ పై క్లిక్ చేసి డాక్యుమంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత Browse other Docs.. పేరుతో ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మరో స్ర్కీన్‌కు మీరు రీచ్ అవుతారు. ఇక్కడ మీరు పంపాలనుకుంటోన్న ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని షేర్ చేసినట్లయితే ఆ ఫోటో ఏ మాత్రం కంప్రెస్ కాకుండా అవతలి వ్యక్తికి షేర్ కాబడుతుంది.

Best Mobiles in India

English summary
How to use two WhatsApp accounts on same phone simultaneously.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X