Google Translate ఫీచర్ వల్ల ఆండ్రాయిడ్ యూజర్లకు చేకూరే ప్రయోజనాలు

|

తమ వినియోగదారులకు అత్యుత్తమ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేసే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ క్రమం తప్పకుండా సరికొత్త యాప్‌లను మార్కెట్లో రిలీజ్ చేస్తూనే ఉంది. గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు.

 
How to Use Google Translate in Any App on Android

అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). గూగుల్ ట్రాన్సలేట్ ఫీచర్ ద్వారా ఆఫ్రికాన్స్, అల్బేనియన్, అమ్హారిక్, అరబిక్ నుండి షోసా, యిడ్డిష్, యోరుబా, జూలూ తదితర 113 భాషలను అనువదించుకునే వీలుంటంది. ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా 50 భాషలను ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంటుంది.

గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలంటే..?

గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలంటే..?

ముందుగా మీ వెబ్‌బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. 'From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలను కుంటున్నారు కాబట్టి 'To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా...?
 

ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా...?

ముందుగా గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్‌ను ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయిన తరువాత చాలా పద్ధతుల్లో టెక్స్ట్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంటుంది. మొదటి పద్ధతిలో భాగంగా యాప్‌లోని కెమెరా ఐకాన్ పై ఒత్తినట్లయితే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఫోకస్‌ను ట్రాన్సలేట్ చేయవల్సిన ప్రింటడ్ డాక్యుమెంట్ పై ఫోకస్ అయ్యేలా చూసుకున్నట్లయితే రియల్ టైమ్‌లో ట్రాన్సలేషన్‌ను పొందే వీలుంటుంది.

మరో పద్థతిలో భాగంగా యాప్‌లోని మైక్రోఫోన్ ఐకాన్ పై ఒత్తి ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటోన్న పదం లేదా లైన్‌ను వినిపించిటం ద్వారా రియల్ టైమ్‌లో ట్రాన్సలేషన్‌ జరిగిపోతుంది. మూడవ పద్ధతిలో భాగంగా

యాప్‌లోని squiggle ఐకాన్ పై ఒత్తి, ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటోన్న పదం లేదా లైన్‌ను డ్రా చేసినట్లయితే రియల్ టైమ్‌లో ట్రాన్స‌లేషన్‌ను పొందే వీలుంటంది.

వొడాఫోన్ కొత్త ఆఫర్లు చెక్ చేసకున్నారా..?వొడాఫోన్ కొత్త ఆఫర్లు చెక్ చేసకున్నారా..?

గూగుల్ ట్రాన్స‌లేటర్‌ను ఇతర యాప్‌లలో ఉపయోగించుకోవటం ఎలా..?

గూగుల్ ట్రాన్స‌లేటర్‌ను ఇతర యాప్‌లలో ఉపయోగించుకోవటం ఎలా..?

ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత టాప్ లెఫ్ట్‌లో కనిపించే మూడు horizontal లైన్స్ పై టాప్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్‌లలో సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ట్రాన్సలేట్‌లోని Tap to Translateను ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మరో యాప్‌ను ఓపెన్ చేసి అందులో కొంత టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే గూగుల్ ట్రాన్సలేట్ ఐకాన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే రియల్ టైమ్‌లో ట్రాన్స‌లేషన్‌ను పొందే వీలుంటంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google has been releasing lots of apps lately in order to make smooth user experience. One such app the company launched somewhere around last year is the 'Google Translate'.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X