ల్యాప్‌టాప్‌ను Wi-Fi hotspotలా వాడుకోవటం ఎలా..?

|

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది.

How to use your laptop as a Wi-Fi hotspot

స్మార్ట్‌‍ఫోన్ దగ్గర నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ ఆధారంగానే పనిచేస్తున్నాయి. ఇక ఇంటిల్లిపాదిని ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచటంలో వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ కనక్టువిటీ విషయంలో చాలా సందర్భాల్లో అంతరాయలను ఫేస్ చేస్తుంటాం. రౌటర్ వర్క్ అవ్వనప్పుడు, మొబైల్ కనక్టువిటీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్నట్ విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది.

ఇటువంటి ఇంటర్నెట్ కనక్టువిటీ సమస్యలు తరచూ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, మీ ల్యాప్‌టాప్‌నే Wi-Fi hotspotలా మలిచి ఇంటల్లిపాదికి ఇంటర్నట్‌ను షేర్ చేయండి. అవును మీరు వింటున్నది నిజమే, ల్యాప్‌టాప్‌లలో ఇన్‌బిల్ట్‌గా పొందుపరచబడే వై-ఫై చిప్ ద్వారా ఇంటర్నెట్ కనక్షన్‌ను ఇతర డివైస్‌లకు బ్రాడ్‌కాస్ట్ చేసుకునే వీలుంటుంది. మీ ల్యాపీ Windows 10 Anniversary అప్‌డేట్ పై రన్ అవుతున్నట్లయతే ఈ hotspot షేరింగ్ ప్రొసీజర్ మరింత సులువుగా ఉంటుంది.

స్టెప్ 1

ముందుగా ల్యాపీలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'Network & Internet' సెట్టింగ్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2

'Network & Internet' విభాగంలోకి వెళ్లిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై లెఫ్ట్ నేవిగేషన్ మెనూలో కనిపించే "Mobile hotspot" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3

మూడవ స్టెప్‌లో భాగంగా మీ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లకు షేర్ చేసేందుకు హాట్ స్పాట్ సెట్టింగ్‌ను Toggle చేయవల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌లోని Ethernet కనెక్షన్ కొద్ది సెకన్లలోని Wi-Fi hotspot రూపంలో షేర్ అవటం ప్రారంభిస్తుంది.

స్టెప్ 4

మీ ల్యాప్‌టాప్ నుంచి హాట్‌స్పాట్ ద్వారా షేర్ అయ్యే ఇంటర్నట్ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లో పొందాలంటే మీ హాట్‌స్పాట్ కనెక్షన్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌ను అక్కడ ఎంటర్ చేయవల్సి ఉంటుంది. సిస్టం జనరేట్ చేసే

పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఉండదు కాబట్టి ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి సులువైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.

స్టెప్ 5

మరొక ప్రొసీజర్‌లో భాగంగా Connectify అనే యాప్‌ను ఉపయోగించుకుని మీ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇతర డివైస్‌లతో షేర్ చేసుకునే వీలుంటుంది.

రూ.15 వేలకే 6GB RAM ఫోన్, ఇప్పుడు టాప్ ఇవే..రూ.15 వేలకే 6GB RAM ఫోన్, ఇప్పుడు టాప్ ఇవే..

Best Mobiles in India

English summary
How to use your laptop as a Wi-Fi hotspot. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X