ఐపిఎల్ 2018 : క్రికెట్‌ను చూస్తూ డబ్బులు సంపాదించడం ఎలా ?

|

దేశం మొత్తం ఐపి ‌ఎల్ క్రికెట్ మానియాలో ఉంది. ఇంతకుముందు లా కాకుండా సరికొత్తగా మాచులను చూసే వెసులుబాటు ఇప్పుడు వినియోగదారులకు లభించింది. ఇంతకు ముందు టీవీలకు అతుక్కుని పోయి క్రికెట్ ను చూసే జనాలు, ఇప్పుడు సరికొత్త రూపాల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐపిల‌ఎల్ సీజన్లో, ఐపిత‌ఎల్ భాగస్వాములు మరియు అప్లికేషన్స్ సరికొత్త ఆప్షన్స్ తో ముందుకు వచ్చాయి. తద్వారా ఆకర్షణీయమైన బహుమతులు పొందే వెసులుబాటు కూడా వినియోగదారులకు లభించనుంది.

 
ఐపిఎల్ 2018 : క్రికెట్‌ను చూస్తూ డబ్బులు సంపాదించడం ఎలా ?

ఈ అప్లికేషన్స్ మిమ్ములను ఫాంటసీ లీగ్స్, క్విజ్, మరియు ప్రిడిక్షన్ గేమ్స్ లో పాల్గొనేలా చేస్తాయి. హాట్ స్టార్, జియో టి‌వి లు కొన్ని పోటీలలో వినియోగదారులు పాల్గొనేలా చేసి ఆకర్షణీయమైన బహుమతులను కూడా అందిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని అప్లికేషన్లు కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఫాంటసీ టీం ( మీరు కోరుకున్న విధంగా జట్టు సభ్యులను ఎంచుకోవడం) ఏర్పాటు చేసుకుని తద్వారా డబ్బులు కూడా సంపాదించగలిగేలా రూపొందించబడ్డాయి. ఆ అప్లికేషన్ల వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

జియో క్రికెట్ ప్లే అలాంగ్ :

జియో క్రికెట్ ప్లే అలాంగ్ :

ఈ జియో "క్రికెట్ ప్లే అలాంగ్" అనేది ఒక లైవ్ మొబైల్ గేమ్. దీనిని మై జియో అప్లికేషన్ నుండి ఆడుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ గేమ్ 11 భాషలను సపోర్ట్ చేయగలదు మరియు ఉచితంగా ఆడుకునే వెసులుబాటు ఉంది. ఈ పోటీలో పాల్గొనడానికి జియో సిమ్ కూడా అవసరం లేదు. ఈ గేమ్ ఒక ప్రిడిక్షన్ గేమ్, ఈ గేమ్ ఆడడం ద్వారా మీరు తర్వాతి బాల్ లేదా ఓవర్ ఎలా జరగనుందో ముందే ఊహించగలిగేలా ఈ గేమ్ ఉంటుంది. పైగా ఇక్కడ మిమ్ములను కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. ఒకవేళ మీరు సరైన ఆన్సర్ ఇస్తే, మీకు కొన్ని పాయింట్లు వస్తాయి. పవర్ ప్లే మోడ్ లో మీకు పాయింట్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పాయింట్లను వినియోగించుకుని బహుమతులను పొందే అవకాశాలు ఉన్నాయి. జియో ఈ పాయింట్లను ఎలా వినియోగించుకోవాలో, తద్వారా ఎలా బహుమతులను గెల్చుకోవాలో కూడా చెప్పాల్సి ఉంది,. కానీ, జియో ఇచ్చిన మాట ప్రకారం 25 కార్లు, ఒక ఉన్నతమైన గృహం, మరియు అదనపు డేటా ఇవ్వవలసి ఉంటుంది.

హాట్ స్టార్ watch n play :
 

హాట్ స్టార్ watch n play :

మీరు క్రికెట్ చూడడానికి హాట్ స్టార్ వినియోగిస్తున్నట్లయితే, ఈ అప్లికేషన్ లో కూడా ప్రిడిక్షన్ గేమ్ ఆడుకునే వెసులుబాటు ఉంది. క్రమంగా తర్వాతి బాల్ గురించిన ప్రశ్న మిమ్ములను అడుగుతుంది. మీరు సరైన సమాధానం ఇచ్చిన పక్షంలో, మీరు బహుమతులను, కూపన్లను పొందే అవకాశం ఉంది. సమయానుసారం మీరు తర్వాతి లెవల్స్ అన్లాక్ చేసుకుని ఆడుకునే వీలుంది. అన్లాక్ చేసిన ఈ లెవల్స్ ద్వారా ఎక్కువ కూపన్లను పొందే వెసులుబాటు ఉంది. ఇవి ఫోన్ పే, Oyo రూమ్స్, yatra.com మరియు పేటియమ్ ఆఫర్ల మీద ఉంటాయి.

డ్రీమ్ 11 :

డ్రీమ్ 11 :

ఫాంటసీ లీగ్ అప్లికేషన్స్ లో అత్యధిక ప్రజాదరణ పొందిన అప్లికేషన్ గా డ్రీమ్ 11 ఉంది. ఈ అప్లికేషన్ సుమారుగా2 కోట్ల మంది వినియోగిస్తుండగా, బహుమతి కూడా కోట్లలోనే ఉండడం విశేషం. మీరు ప్రత్యేకమైన ఫాంటసీ టీం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది, మీ ప్లేయర్స్ బాగా ఆడిన పక్షంలో మీకు పాయింట్లు వస్తుంటాయి. తద్వారా ఈ ఎస్‌ఎన్ చివరిలో విజేతలు ప్రకటించబడుతారు. ఈ అప్లికేషన్లో చేరినందుకు 100 రూపాయలు బోనస్ గా కూడా ఇవ్వబడుతుంది.

 ఐపిఎల్ ఫాంటసీ లీగ్ :

ఐపిఎల్ ఫాంటసీ లీగ్ :

ఇది ఐపిి‌ఎల్ అధికారిక అప్లికేషన్. ఇందులో కూడా ఐపిు‌ఎల్ ఫాంటసీ లీగ్ ఉంటుంది. ఇందులో వచ్చే పాయింట్ల ఆధారితంగా, బహుమతులు గెల్చుకునే వెసులుబాటు ఉంది. ఇది ఇంచుమించు డ్రీమ్ 11 వలె ఉన్నాకూడా, ఇందులో బోనస్ డబ్బులు ఇవ్వబడవు. ఇది కేవలం ఒక క్రికెట్ మైదానం అనుభూతిని ఇచ్చే దిశగా ఉపయోగపడుతుంది.

Brainbaazi

Brainbaazi

ఇది సరికొత్త క్విజ్ గేమ్ వలె ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ఈ క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటి‌ఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

Best Mobiles in India

English summary
IPL 2018: How to watch cricket matches and earn money More news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X