మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయటం లేదా..?

By Sivanjaneyulu
|

ప్రముఖ మెసెజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ గురించి ఎంత మాట్లాడుకున్నాతక్కువే. ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచాన్ని శాసిస్తోన్న వాట్సాప్ కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది.

మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయటం లేదా..?

లెక్కకు మిక్కిలి ఫీచర్లతో నేటి యువతరాన్ని ఉర్రూతలూగిస్తోన్న వాట్సాప్ ద్వారా మెసేజెస్‌తో పాటు ఆడియో వీడియో ఫైల్స్‌ను నిరంతరాయంగా షేర్ చేసుకోవచ్చు. ఇన్ని సదుపాయాలతో వస్తోన్న వాట్సాప్ అప్లికేషన్‌లో చిన్నా, చితకా సమస్యలు తలెత్తటాన్ని సర్వసాధారణంగా భావించాలి. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్ సరిగ్గా పనిచేయకపోయినట్లయితే ఈ సూచనలను ఫాలో అవ్వండి...

Read More : గంటల తరబడి చాటింగ్ చేస్తున్నా, ఈ ఫోన్‌లలో బ్యాటరీ తరగదు

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ డివైస్ ఆండ్రాయిడ్ 2.1 ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేస్తున్నదై ఉండాలి. 2016 చివరి నాటికి ఆండ్రాయిడ్ 2.1, 2.2 వర్షన్‌లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న వారు లేటెస్ట్ వర్షన్ యాప్‌ను పొందే క్రమంలో ఏమైనా సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే తన ఫోన్ సెట్లింగ్స్‌లోని Unknown Sources ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే Settings >> Security >> Unknown Sources

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

సాధారణంగా వై-ఫై లేదా డేటా నెట్‌వర్క్ ఎర్రర్స్ కారణంగా వాట్సాప్ అకౌంట్ నిర్వహణలో సమస్యలు తలెత్తుంటాయి. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్ ద్వారా మెసెజ్‌లను సైతం సెండ్ చేయలేకపోతున్నట్లయితే ఇలా చేయండి..

- మీ ఫోన్‌లో లేటెస్ట్ వాట్సాప్ యాప్ ఇన్‌స్టాల్ చేసి చూడండి.
- మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి.
- యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి రీఇన్‌స్టాల్ చేసి చూడండి.

 

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్‌ను గుర్తించలేక పోవటానికి చాలా కారణలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఖచ్చితమైన ఫోన్ నెంబర్ లను మీరు పొందుపరచకపోవటం.

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్‌టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేయాలంటే WhatsApp Plus అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Is your WhatsApp not working? Here Are The Solutions. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X