మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?

|

ప్రభుత్వ యాజమాన్యంలోని విశ్వసనీయ టెలికాం సర్వీస్ ఆపరేటర్లలో ఒకటైన బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు భారీ యూజర్ బేస్ ఉన్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ కూడా పెద్ద కస్టమర్ బేస్ ను కలిగి ఉంది. ఇది అనేక ఆఫర్లతో కొత్త యూజర్లను ఆకట్టుకుంటుంది. మీరు BSNL కస్టమర్ అయి ఉండి అన్ని రకాల సేవలకు సైన్ అప్ చేసి ఉంటే కనుక మీ మొబైల్ నంబర్‌ను గుర్తుంచుకోవడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి BSNL తన వినియోగదారులకు వారి ఫోన్ నంబర్‌ను తెలుసుకోవడానికి కొన్ని ఎంపికలను అందిస్తుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Using USSD Code How to Find Your Own BSNL Mobile Phone Number

USSD కోడ్‌ల ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ నంబర్‌ను తెలుసుకునే విధానం

 

అకౌంట్ బ్యాలెన్స్, డేటా ప్లాన్ లభ్యత వంటి మరెన్నో వివరాలను తెలుసుకోవడంలో వినియోగదారులకు సహాయపడటానికి BSNL ప్రత్యేకమైన USSD కోడ్‌లను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ను తెలుసుకోవడానికి ఒక నిర్దిష్ట USSD కోడ్‌ను అందిస్తుంది. తమ ఫోన్ నంబర్‌ను తనిఖీ చేయడానికి మీ BSNL మొబైల్ నంబర్ నుండి '* 222 #' డయల్ చేయండి. కాల్ కనెక్ట్ అయిన తర్వాత వినియోగదారులు తమ స్క్రీన్‌పై తక్షణమే ఒక SMS ని చూస్తారు. ఈ SMS లో మీ యొక్క మొబైల్ నంబర్‌ను చూడవచ్చు. ఫోన్ నంబర్లను తెలుసుకోవటానికి బిఎస్ఎన్ఎల్ USSD కోడ్స్ అనేది సరళమైన మార్గాలలో ఒకటి. BSNLయొక్క ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ కోడ్ తో తమ నెంబర్లను తెల్సుకోవచ్చు.

Using USSD Code How to Find Your Own BSNL Mobile Phone Number

యాప్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ నంబర్‌ను తెలుసుకోవడం

ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి ఏదైనా మరొక మార్గం ఉందా అని మీరు చూస్తుంటే కనుక బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ యాప్ ను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మొదటగా ఫోన్ లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి అధికారిక BSNL యాప్ ను డౌన్‌లోడ్ చూసుకోవాలి. డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ కొత్త మొబైల్ నంబర్‌తో యాప్ ను లాగిన్ అవ్వండి. యాప్ లాగిన్ అయిన తరువాత హోమ్ స్క్రీన్‌లో BSNL వినియోగదారుల ఫోన్ నంబర్‌ను చూపుతుంది. ఇది ఎప్పటికి వినియోగదారులకు మరచిపోకుండా చూపుతూ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Using USSD Code How to Find Your Own BSNL Mobile Phone Number

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X