WhatsApp చాట్‌లను బ్యాకప్ & ఎక్సపోర్ట్ చేయడం ఎలా?

|

అతి శీఘ్రముగా మెసేజ్ లను పంపడానికి ఎక్కువ వినియోగించే యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ మాత్రమే. మీరు వాట్సాప్ యూజర్ అయితే కనుక మీరు ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ కు మారినప్పుడు మీ యొక్క అన్ని మెసేజ్ లను బ్యాకప్ చేయాలనుకోవచ్చు. గూగుల్ చాట్‌ ద్వారా అన్ని చాట్‌లను బ్యాకప్ చేయవచ్చు. కాబట్టి మీరు యాప్ ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మెసేజింగ్ యాప్ ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలని ఎంచుకుంటే అన్ని చాట్‌లను తిరిగి పొందవచ్చు. అయితే ఈ వాట్సాప్ యాప్ మీ డేటాను స్వయంచాలకంగా బ్యాకప్ చేయదు కనుక మీరు సెట్టింగ్‌ల విభాగం నుండి ఆ ఎంపికను ప్రారంభించవలసి ఉంటుంది. కాకపోతే మీరు చాలా కాలంగా వాట్సాప్ ఉపయోగిస్తుంటే కనుక మీ గూగుల్ డ్రైవ్‌కు తగినంత స్టోరేజ్ ఉందని నిర్ధారించుకోవాలి.

వాట్సాప్ డేటా బ్యాకప్

వాట్సాప్ డేటా బ్యాకప్

సెల్యులార్ లేదా వై-ఫై ద్వారా కూడా మీ యొక్క డేటాను బ్యాకప్ చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ డేటాను సేవ్ చేయవచ్చు. మీరు గూగుల్ డిస్క్‌లో స్టోర్ చేయకూడదనుకుంటే మీ అన్ని చాట్‌లను ఎక్సపోర్ట్ చేయడానికి కూడా వాట్సాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Gmail, Telegram వంటి ఇతర యాప్ లకు మీ యొక్క చాట్‌ బ్యాకప్ ను ఎగుమతి చేయవచ్చు. వాట్సాప్ మెసేజ్ లను బ్యాకప్ చేయాలనుకుంటే లేదా చాట్‌లను ఎక్సపోర్ట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్!! త్వరపడండి మిస్ అవ్వకండి...Also Read: ACT ఫైబర్‌నెట్ దసరా క్యాష్‌బ్యాక్ ఆఫర్!! త్వరపడండి మిస్ అవ్వకండి...

గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ చాట్‌లను బ్యాకప్ చేసే విధానం

గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ చాట్‌లను బ్యాకప్ చేసే విధానం

స్టెప్ 1: వాట్సాప్ ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ భాగంలో గల మూడు-చుక్కల చిహ్నాన్ని ఎంచుకొని అందులో సెట్టింగుల విభాగానికి వెళ్ళండి.


స్టెప్ 2: చాట్స్> చాట్ బ్యాకప్ ఎంపికల మీద నొక్కండి.


స్టెప్ 3: వాట్సాప్ యాప్ అన్ని చాట్‌లను గూగుల్ డిస్క్‌లోకి బ్యాకప్ చేయాలనుకున్నప్పుడు మరొక విధానాన్ని అనుసరించాలి.

 

వాట్సాప్ చాట్‌లను ఎక్సపోర్ట్ చేసే విధానం

వాట్సాప్ చాట్‌లను ఎక్సపోర్ట్ చేసే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు ఎక్సపోర్ట్ చేయదలిచిన చాట్‌కు వెళ్లండి.

స్టెప్ 2: చాట్‌లో కుడివైపు ఎగువ మూలలో గల మూడు-చుక్కల బటన్ మీద నొక్కండి.

స్టెప్ 3: మోర్ ఎంపిక మీద క్లిక్ చేయండి > ఎక్సపోర్ట్ చాట్ మీద నొక్కండి. మీరు మీడియాను ఎక్సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అన్ని అనే ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది.

స్టెప్ 4: మీకు కావలసిన ఎంపికను ఎంచుకున్న తర్వాత మీరు చాట్‌ను ఎక్కడ ఎగుమతి చేయాలనుకుంటున్నారో మీకు ఎంపికలు ఇవ్వబడతాయి.

 

Best Mobiles in India

English summary
WhatsApp Messages Backup into Google Drive and Export Chats Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X