ఇంత ఘోరంగా జాతి వివక్షను రెచ్చగొడతారా ? ట్విట్టర్‌లో వైరల్ వీడియో

Written By:

ఆ కంపెనీ తన దుస్తుల ప్రచారం కోసం ట్విట్టర్ లో పెట్టిన యాడ్ పెద్ద తలనొప్పులను తెచ్చిపెట్టింది. నల్ల జాతీయులను తెల్ల జాతీయులు ఇంకా తొక్కేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో కంపెనీ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుని జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని వెంటనే ప్రత్యామ్నాయ యాడ్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ న్యూస్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా దూసుకుపోతోంది.

Read more : జర్నలిస్ట్ అత్యుత్సాహం: మోడీ సౌదీ రాజు కాళ్లు మొక్కారా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఎలెన్ డిజెనరస్ పిల్లల దుస్తులను ప్రచారం చేసేందుకు గానూ గ్యాప్ కిడ్స్ సంస్థ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పెట్టిన యాడ్ వివాదాస్పదమైంది. ఆ యాడ్ జాతి వివక్షతను చూపుతోందని పలువురు విమర్శలు కుప్పించారు.

2

యాడ్ లో ఓ నల్లజాతి బాలిక నెత్తిపై ఓ తెల్లజాతి బాలిక కుడి మోచేతిని ఆనించినట్లుగా ఫొటో ఉండడం పట్ల అందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఆ యాడ్‌లో ఎక్కువ మంది తెల్లజాతీయులను పెట్టి ఒకే ఒక నల్లజాతి బాలికను చూపడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

3

‘బాలికలు ఏదైనా సాధించగలరనే పిల్లలను చూడండి' అనే కాప్షన్‌తో, ‘పరస్పరం సాధికారత సాధించే సామర్థ్యం మా అందరికి ఉంది' అనే ట్యాగ్‌లైన్‌తో యాడ్ సాగుతుంది. దీనిపై కొందరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

4

సాధికారత సాధించడమంటే ఇదేనా, తెల్లజాతి బాలిక మోచేతి బరువు మోయడమా? అని ఒకరు, నల్లపిల్ల కాకపోతే ఏమైనా సాధించగలమన్న అర్థమా, నల్ల పిల్లలు కేవలం తెల్ల పిల్లల మోచేతులు మోయడానికే పనికొస్తారని చెప్పడమా యాడ్ ఉద్దేశం అంటూ మరొకరు, అసలు యాడ్‌లో ఒక్క నల్ల పిల్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారంటూ ఇంకొకరు విరుచుకుపడ్డారు.

5

దీంతో బిత్తర పోయిన గ్యాప్ కిడ్స్ కంపెనీ జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, క్షమాపణలు చెబుతున్నామని, ఎవరని నొప్పించడం తమ ఉద్దేశం కాదని గ్యాప్ కిడ్స్ వెంటనే ఓ ప్రకటనను విడుదల చేసింది.

6

అంతే కాకుండా దీన్ని వెంటనే తొలగించి ప్రత్యామ్నాయ యాడ్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. నిజ జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్లనే తమ యాడ్‌కు ఎంపిక చేస్తున్నామని అందువల్లనే వారుని సెలక్ట్ చేసుకున్నామని కూడా తెలిపింది.

rn

7

దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఓ కన్నేయండి

8

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ellen DeGeneres Gap Kids ad sparks Twitter backlash
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot