మనం గుర్తుపెట్టుకోవల్సిన 10 ఐకానిక్ మొబైల్ ఫోన్‌లు

Posted By: Sivanjaneyulu Bommu

మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌ లేదా సెల్యులార్‌ ఫోన్‌ అని పిలుస్తారు. మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను 1983లో 'మోటోరోలా' కంపెనీ విడుదల చేయగా దాని బరువు రెండు కిలోలుగా ఉండేది. కాలక్రమంలో సెల్‌ఫోన్ కాస్తా, స్మార్ట్‌ఫోన్‌లా రూపాంతరం చెందింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం రేపిన 10 ఐకానిక్ మొబైల్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా డైనాటాక్, 1984

డైనాటాక్ పేరుతో ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను 1984లో మోటరోలా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవటానికి 10 గంటల సమయం తీసుకునేది. పూర్తిగా ఛార్జ్ అయిన ఫోన్‌ను 30 నిమిషాల పాటు మాత్రమే వాడుకునేందుకు వీలుండేది. ఈ ఫోన్‌లో 30 నెంబర్ల వరకు స్టోర్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ ఖరీదు 400 డాలర్లు.

మోటరోలా స్టార్‌టాక్, 1996

డైనాటాక్ పేరుతో ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను 1984లో లాంచ్ చేసిన మోటరోలా, 1996లో స్టార్‌టాక్ పేరుతో ప్రపంచపు మొట్టమొదటి క్లామ్‌షెల్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఖరీదు 1000 డాలర్లు. 2జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ మోనోక్రోమ్ గ్రాఫిక్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ మొబైల్ ఫోన్‌లో మోనో రింగ్‌టోన్స్, వైబ్రేషన్ అలర్ట్స్ ఉంటాయి.

నోకియా కమ్యూనికేటర్, 1996

నోకియా తన మొదటి మొబైల్ ఫోన్‌ను నోకియా కమ్యూనికేటర్ పేరుతో 1996లో లాంచ్ చేేసింది. 8ఎంబి స్టోరేజ్ సామర్థ్యంతో విడుదలైన ఈ మొబైల్ ఫోన్‌లో 4ఎంబి స్టోరేజ్ స్పేస్‌ను యూజర్ ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ క్లామ్‌షెల్ డిజైన్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను కూడా బ్రౌజ్ చేసుకునే వీలుంటుంది.

నోకియా 3310

నోకియా నుంచి లాంచ్ అయిన అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లలో నోకియా 3310 ఒకటి. బిల్ట్ క్వాలిటీ విషయంలో ఈ ఫోన్‌ను మించిన డివైస్ ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ కాలేదు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే మండుటెండలో సైతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో మూడు మెసేజ్‌లను కలిపి ఒకే మెసేజ్‌గా పంపుకునే వీలుంటుంది.

కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !

నోకియా 1100

నోకియా నుంచి లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన ఫీచర్ ఫోన్‌లలో నోకియా 1100 ఒకటి. ఈ ఫోన్‌ను ఇప్పటి వరక చాలా మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఫుల్ ఛార్జ్ పై 20 రోజుల బ్యాకప్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేయగలుగుతుంది. 50 టెక్స్ట్ మెసేజ్‌లను ఈ ఫోన్ భద్రపరచగలదు.

ట్రియో 180

పామ్ ట్రియో పేరుతో పాపులర్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ పామ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. మోనోక్రోమ్ టచ్‌స్ర్కీన్ ఈ డివైస్‌కు మరో ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది.

మోటరోలా రేజర్

మోటరోలా నుంచి లాంచ్ అయిన పాపులర్ మొబైల్ ఫోన్‌లలో మోటరోలా రాజర్ ఒకటి. ఈ ఫ్యాషనబుల్ గాడ్జెట్‌కు ఆ రోజుల్లో లభించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మినీ యూఎస్బీ పోర్టుతో లాంచ్ అయిన ఈ డివైస్ ద్వారా మ్యూజిక్ వినేందుకు కూడా చాలా మంది ఇష్టపడే వారు.

ఐఫోన్

యాపిల్ తన మొట్టమొదటి ఐఫోన్ మోడల్‌ను 2007లో లాంచ్ చేసింది. కెపాసిటివ్ టచ్ స్ర్కీన్స్‌తో లాంచ్ అయిన ఈ డివైస్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. స్టీవ్ జాబ్స్ చేతుల మీదగా లాంచ్ అయిన ఈ డివైస్ మొబైల్ సెగ్మెంట్‌ను ఓ స్థాయికి తీసుకువెళ్లింది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్

సామ్‌సంగ్ నుంచి లాంచ్ అయిన వినూత్న స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ నోట్ ఒకటి. మినీ కంప్యూటర్ మాదిరిగా వర్క్ అయ్యే ఈ 5.3 అంగుళాల పెద్దతెర డివైస్ ఐరిస్ స్కానింగ్, కర్వుడ్ స్ర్కీన్, వాటర్ ప్రూఫింగ్, స్టైలస్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంది.

ఎల్‌జీ జీ6

18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేతో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఎల్‌జీ జీ6 గుర్తింపు తెచ్చుకుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ కారణంగా ఈ ఫోన్ ఆఫర్ చేసే విజువల్స్ మరింత పెద్దవిగా కనిపిస్తాియి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
One of the most used and the abused gadget on the planet is undoubtedly the smartphones.Today, in this article, we have listed out the 10 iconic smartphones that made the tech world proud of.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot