మార్కెట్లోకి బీటెల్ బడ్జెట్ ఫోన్స్

Posted By: Super

మార్కెట్లోకి బీటెల్ బడ్జెట్ ఫోన్స్

1990లలో ఇండియాలో బీటెల్ కంపెనీ అందరికి బాగా సుపరిచితం. ఇండియాలో ల్యాండ్ లైన్ ఫోన్స్‌కు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది మాత్రమే కాకుండా ల్యాండ్ లైన్ సర్వీస్ ప్రోవైడర్ ఎవరైనా ఉన్నారంటే వారు తప్పనిసరిగా వీటిని ఉపయోగించడం జరిగేది. ఇండియన్ టెలికమ్ మార్కెట్లో అభివృద్ది చెందడమే కాకుండా ఆసియాలో గొప్ప ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా సొంతం చేసుకుంది. అలా గ్లోబల్ బిజినెస్‌లో పార్ట్ అయింది. అంతేకాకుండా భారతీ ఎంటర్ ప్రైజెస్‌లో భాగస్వామిగా కూడా చేరింది.

మొట్టమొదట ఇండియాలోని మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ ఆ తర్వాతి కాలంలో బిజినెస్ ఏరియాలో అడుగు పెట్టి వంద శాతం అభివృద్దిని సాధించింది. ఇటీవల కాలంలో బీటెల్ కంపెనీ రెండు కొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ బీటెల్ జిడి 310, బీటెల్ జిడి 218. ఈ రెండు మొబైల్స్‌ని కూడా బీటెల్ సిఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ సాన్నే సమక్షంలో ప్రెస్ కాన్పరెన్స్ పెట్టి మరీ విడుడుల చేయడం జరిగింది. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ కస్టమర్స్ కోసం మార్కెట్లోకి బీటెల్ కంపెనీ నుండి రెండు మొబైల్స్‌ని విడుదల చేస్తున్నాం.

ఈ రెండు మొబైల్స్ కూడా అతి తక్కువ ధరలో, నాణ్యమైన ఫీచర్స్‌తో కస్టమర్స్‌ని ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపోందించబడ్డాయను అన్నారు. మొదటగా మేము మార్కెట్లోకి కస్టమర్స్ మనసుని దొచుకునే విధంగా మొబైల్స్‌ని రూపోందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంతకంటే మంచి మొబైల్స్‌ని కూడా విడుదల చేస్తామని అన్నారు. బీటెల్ జిడి 310, బీటెల్ జిడి 218 రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ ఫోన్స్. రెండు మొబైల్స్‌లలో కూడా కెమెరా ఫీచర్ ఉంది. విజిఎ క్వాలిటీతోటి వీడియో రికార్డింగ్ ఫెసిలిటీని కూడా కల్పించారు.

బీటెల్ జిడి 310 మొబైల్‌లో వన్ టచ్ టార్చ్ లైట్‌ని కూడా పోందుపరచడం జరిగింది. ఎఫ్‌ఎమ్ రేడియో బయటకు సౌండ్ పెద్దగా వినిపించేందుకుగాను పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాయి. దీని ధర కూడా చాలా తక్కువ కేవలం రూ 1799. ఇక బీటెల్ జిడి 218 ధర విషయానికి కేవలం రూ 1499 మాత్రమే. ఇక బీటెల్ జిడి 218 మొమొరీని 8జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. బీటెల్ మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చి మరలా తన పూర్వవైభవాన్ని సోంతం చేసుకోవడంలో ఎటువంటి ఢోకా ఉండదని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot