లీకైన గూగుల్ పిక్సెల్ 4,4XL స్మార్ట్‌ఫోన్‌ వివరాలు

|

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు అంటే మొదటిగా గుర్తు వచ్చేది మరియు ముందు వరుసలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్లు. గూగుల్ సరికొత్త గూగుల్ పిక్సెల్ 4 మరియు పిక్సెల్ 4 ఎక్స్‌ఎల్ అక్టోబర్ 15 న లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముందు వీటికి సంబందించిన అనేక విషయాలను అనేక సందర్భాల్లో లీక్ చేసారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

లీకైన సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్‌లో 5.7-అంగుళాల FHD + OLED ప్యానెల్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు యాంబియంట్ EQ తో వస్తుంది. మరోవైపు ప్రీమియం గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్‌ఎల్ కూడా 6.3-అంగుళాల QHD+ OLED ప్యానల్‌ డిస్ప్లే తో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు యాంబియంట్ EQతో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ న్యూరల్ కోర్ తో జత చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా-కోర్ SoC చేత పనిచేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ లేదా 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.

RS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3A

కెమెరా

కెమెరా

ఫోటోగ్రఫీ విభాగంలో గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ చివరకు వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను అందిస్తోంది. ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. ముందువైపు గల కెమెరాల గురించి ఎటువంటి వివరాలు తెలియదు. రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్టీరియో స్పీకర్లు, టైటాన్ M సెక్యూరిటీ మాడ్యూల్, మోషన్ సెన్స్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తాయి. డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించిన వివరాలు తెలియదు.

గూగుల్ ఫర్ ఇండియా 2019లో కొత్త ఆవిష్కరణలు

బ్యాటరీ

బ్యాటరీ

గూగుల్ పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్‌ 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో మరియు గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ 3,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెండింటిలో ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రతి ఇతర గూగుల్ ఫోన్ మాదిరిగానే మీకు 3 సంవత్సరాల OS మరియు భద్రతా అప్డేట్ లు లభిస్తాయి.

RS.10,000 భారీ డిస్కౌంట్ ధరతో గూగుల్ పిక్సెల్ 3A

ఇన్-బాక్స్
 

ఇన్-బాక్స్

ఇక్కడ గమనించదగ్గ మరొక విషయం ఏమిటంటే ఇన్-బాక్స్ విషయాలు. ఈ రెండు ఫోన్లు యుఎస్‌బి-సి, యుఎస్‌బి-సి కేబుల్, ఛార్జింగ్ అడాప్టర్, సిమ్ ఎజెక్షన్ టూల్ మరియు క్విక్ స్టార్ట్ గైడ్ ను కలిగి ఉంటాయి. బడ్స్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ గురించి ఎటువంటి వివరాలు తెలియదు. బహుశా ఇయర్ ఫోన్స్ ఫోన్ తో పాటు రాకపోవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అక్టోబర్ 15 వరకు వేచిఉండాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pixel 4, 4XL Specification Leaked for October Launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X